Reading Time: < 1 minute

సీఎంసీ, ఎంఎంసీల్లో అక్రమ నిర్మాణాలపై యాక్షన్

Caption of Image.

హైదరాబాద్ సిటీ, వెలుగు:  సీఎంసీ పరిధిలో శుక్రవారం 13 అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించి నేలమట్టం చేశారు. మరో ఇద్దరు యజమానులకు నోటీసులు జారీ చేశారు. అలాగే, ఎంఎంసీలోని మాన్సురాబాద్, నాగోల్, హయత్ నగర్, నాచారం ప్రాంతాల్లోనూ అక్రమ నిర్మాణాలను తొలగించారు.  

గాజులరామారంలో  అక్రమ నిర్మాణాల కూల్చివేత

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్​మండలం గాజులరామారంలోని ప్రభుత్వ భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. గ్రామంలోని సర్వే నంబర్లు 329/1, 342లలో కబ్జాదారులు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి, పెద్ద సంఖ్యలో నిర్మాణాలు చేపట్టి, వాటిని పేదలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సాయిబాబా, సాబేర, అబీద్, బురుగ రాజన్న బస్తీలలో ఆక్రమణలపై ఆఫీసర్లకు వరుస ఫిర్యాదులు అందాయి. దీంతో డిప్యూటీ తహసీల్దార్​ సుధాకర్​, ఆర్ఐ కలీమ్​పర్యవేక్షణలో 25 ఇండ్లు, 10 బేస్​మెంట్​లను కూల్చివేశారు.

©️ VIL Media Pvt Ltd.