
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత వాంగ్ చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో కీలక వ్యాఖ్యలు చేశారు. నెల రోజుల పోరాటంలో విజయం సాధించిన Gen Z పై ప్రశంసలు కురిపించిన గీతాంజలి ఆంగ్మో… పరోక్షంగా ప్రధాని మోదీని విమర్శించారు. భారత దేశానికి విశ్వగురువు ఎలా ఉండాలో చూపించింది ఒక్క జెన్ జెడ్ మాత్రమే అన్నారు.
జెన్ జెడ్ సనాతన ధర్మాన్ని ఆచరించి చూపించారు. అంతేగానీ ప్రబోధాలు చేయలేదు.. ద్వేషం లేని ధైర్యం, హింస లేని బలం.. గుడ్డి విధేయత లేని దేశభక్తిని చూపించారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతా కాకుండా సొంత దేశాన్ని తగలబెట్టకుండానే అన్యాయానికి వ్యతిరేకంగా దృఢంగా నిలబడవచ్చని వారు నిరూపించారని పొగడ్తలతో ముంచెత్తారు.
హిందూ జాతీయవాద పార్టీ .. ఈ యువ భారతీయులనుంచి హిందూమతం, జాతీయవాదం, నిజమైన విశ్వగురువుగా ఉండటం అంటే ఏమిటో నేర్చుకోవాల్సి సమయం ఆసన్నమైందని ఆమె సోషల్ మీడియా Xలో ఓ పోస్ట్ ను షేర్ చేశారు.
If anyone has shown what it means for India to be a Vishwaguru, it is our Gen Z.
They have lived Sanatan Dharma, not preached it. Courage without hate. Strength without violence. Patriotism without blind obedience.
Unlike many of their counterparts across the world, they have…— Gitanjali J Angmo (@GitanjaliAngmo) July 25, 2026