Reading Time: 1 minute

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. దినేశ్ కార్తీక్, గుత్తా జ్వాల కామెంట్స్ వైరల్!

Caption of Image.

Dharmendra Pradhan Resign: నీట్ (NEET) పేపర్ లీకేజీ ఆరోపణలతో దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగసిపడిన విద్యార్థుల ఆందోళనలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ కీలక పరిణామంపై దేశవ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన వారు స్పందిస్తున్నారు. భారత క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. 

విద్యార్థులకి నమ్మకం కలిగించాలి: దినేష్ కార్తీక్
భారత మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ దినేష్ కార్తీక్ ఈఅంశంపై మొదటగా స్పందించిన క్రీడాకారుల్లో ఒకరిగా నిలిచారు. పోరాటం చేస్తున్న విద్యార్థులకు ఆయన పూర్తి మద్దతు ప్రకటిస్తూ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ రాజీనామా ద్వారా దేశ విద్యా వ్యవస్థలో అర్ధవంతమైన, పారదర్శకమైన సంస్కరణలకు మార్గం సుగమమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న లక్షలాది మంది అభ్యర్థుల్లో మళ్లీ నమ్మకాన్ని, ధైర్యాన్ని నింపేందుకు ఇది ఎంతో అవసరమని దీనేస్ కార్తీక్ వెల్లడించాడు.  

ఇది ముగింపు కాదు.. ప్రారంభం మాత్రమే: గుత్తా జ్వాల
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది ఒక రకంగా ముఖ్యమైన అడుగు అయినప్పటికీ, దీనిని కేవలం సమస్య ముగింపుగా పరిగణించకూడదని బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల స్పష్టం చేసింది. కేవలం ఒక రాజీనామాతో సరిపెట్టకుండా, భవిష్యత్తులో ఇలాంటి లీకేజీలు పునరావృతం కాకుండా దీర్ఘకాలిక మార్పులు, సంస్కరణలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని కోరారు. విద్యార్థులకు పూర్తి న్యాయం జరగాలని, భారత విద్యా వ్యవస్థ విశ్వసనీయతను కాపాడటమే ప్రాథమిక లక్ష్యం కావాలని గుత్తా జ్వాల తెలిపింది. 

కొనసాగుతున్న ఉద్యమం: 
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను స్వాగతిస్తున్నప్పటికీ, తమ పోరాటం ఇక్కడితో ఆగదని ఉద్యమ నాయకులు స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు, పూర్తి స్థాయి జవాబుదారీతనం లభించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని విద్యార్థి సంఘాలు తేల్చి చెప్పాయి. 

©️ VIL Media Pvt Ltd.