Reading Time: < 1 minute

ఇకపై యువత గొంతును అణచివేసే సాహసం ఎవరూ చేయరు: ప్రియాంకాగాంధీ

Caption of Image.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకాగాంధీ స్పందించారు.  ఇది భారతీయ యువత సాధించిన విజయం అన్నారు ప్రియాంకాగాంధీ. రాజ్యాంగాన్ని నాశనం చేయాలనుకున్నవారి నుంచి దేశ ప్రజలు  తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టారని అన్నారామె.  జెన్ జెడ్ ఉద్యమంలో యువత విజయం సాధించేందుకు సాధ్యమైనంత బలం కాంగ్రెస్ పార్టీ అందించిందని అన్నారు. 

గత రెండేళ్లుగా ఎగ్జామ్ పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణ విధానంలో సంస్కరణలకు రాహుల్ పోరాటం చేస్తున్నారని, ఎగ్జామ్ పేపర్ లీక్ అంశాన్ని లేవనెత్తడమే కాకుండా, విద్యార్థులకు మద్దతివ్వడంలోనూ దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మించడంలోనూ కాంగ్రెస్ యూత్ ను ప్రేరేపించారని అన్నారు ప్రియాంక. 

ఈ రోజు చాలా సంతోషంగా ఉంది.. ఇది ఆరంభం మాత్రమే.. యువత తిరుగబడితే ఏం జరగుతుందో  ఈ ఉద్యమంతో ప్రభుత్వాలకు తెలిసిందన్నారు.ఆర్ ఎస్  ఎస్ విద్యావ్యవస్థను  పూర్తిగా ఆక్రమిస్తోంది.. పూర్వీకుల భావజాలాన్ని దెబ్బతీసేలా చేస్తోంది.. నిరసన గళం వినిపించే యువతపై బలప్రయోగానికి  పాల్పడుతోందన్నారు. దేశ యువత తమ గళాన్ని వినిపించింది.. ఇకపై యువత గొంతును అణచివేసే సాహసం ఎవరూ చేయలేరని అన్నారు  కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకాగాంధీ. 

©️ VIL Media Pvt Ltd.