Reading Time: < 1 minute
Cjp Reaction Dharmendra Pradhan Resignation Student Power

CJP: నీట్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. రాజీనామా తర్వాత జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే మాట్లాడుతూ.. ప్రపంచం తల వంచుతుంది, దానిని వచ్చే వారు కావాలి అని అన్నారు. రాజీనామా తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఎక్స్‌లో ‘‘విద్యార్థి శక్తి వర్ధిల్లాలి’’ అని ట్వీట్ చేసింది. ప్రధాన్ రాజీనామా తర్వాత జంతర్ మంతర్ వద్ద యువత సంబరాలు చేసుకుంది.

ఈ సందర్భంగా దీప్కే మాట్లాడుతూ.. ‘‘ఇదే ప్రజాస్వామ్యం, ఆయన రాజీనామా చేశారు. గుర్తుంచుకోండి. కాక్‌రోచ్‌తో పెట్టుకోవద్దు’’ అని అన్నారు. ఇదిలా ఉంటే, కేంద్రం-సీజేపీ మధ్య జరగాల్సిన మూడో విడత చర్చలకు కొన్ని గంటల ముందు కేంద్ర మంత్రి రాజీనామా ప్రకటించారు. ఆయన తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్రమోడీకి పంపించారు. విద్యార్థుల భవిష్యత్తు న్యాయపరమైన అంశాల్లో చిక్కుకోవద్దని, దేశ విద్రోహశక్తులకు అవకాశం ఇవ్వొద్దనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.