Reading Time: < 1 minute
Delhi Metro Reopens Rajiv Chowk Mandi House Central Secretariat Entry Gates

విద్యార్థుల నిరసనతో గత కొద్దిరోజులుగా ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూతపడ్డాయి. భద్రతా కారణాల దృష్ట్యా స్టేషన్లు మూసేశారు. దీంతో ఉద్యోగులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విద్యార్థుల ఆందోళన విరమించారు. దీంతో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ మెట్రో సంస్థ.. మూతపడ్డ స్టేషన్లు ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీ మెట్రో కీలక ప్రకటన విడుదల చేసింది. రాజీవ్ చౌక్ సహా మూడు మెట్రో స్టేషన్ల ఎంట్రీ గేట్లు మళ్లీ తెరుచుకున్నాయి. ఢిల్లీలోని రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ల ప్రవేశ ద్వారాలను తిరిగి తెరిచినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటించింది. గతంలో భద్రతా కారణాలతో ఈ స్టేషన్ల ఎంట్రీ గేట్లను తాత్కాలికంగా మూసివేయగా.. తాజా పరిస్థితులను సమీక్షించిన అనంతరం వాటిని మళ్లీ ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డీఎంఆర్‌సీ తెలిపింది.

ప్రస్తుతం ఈ మూడు మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు సాధారణంగా ప్రవేశించి ప్రయాణించవచ్చని అధికారులు స్పష్టం చేశారు. అయితే భద్రతా తనిఖీలు యథావిధిగా కొనసాగుతాయని, ప్రయాణికులు మెట్రో సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటించాలని డీఎంఆర్‌సీ విజ్ఞప్తి చేసింది.