Reading Time: 2 minutes
Aamani : ఇప్పుడున్న హీరోలలో అతడంటే ఇష్టం.. అతడి యాక్టింగ్ చూస్తూనే ఉండిపోతా.. ఆమని..

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆమని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు బుల్లితెరపై సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. అయితే ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన మనసులోని పలు విషయాలను పంచుకున్నారు. తన జీవితంలో కుటుంబ బాధ్యతలు చూసుకోవడం మొదటి నుంచీ అలవాటేనని ఆమని తెలిపారు. చిన్నతనం నుంచే ఇంట్లో ప్రతీ చిన్న విషయాన్ని ఎంతో శ్రద్ధగా చూసుకునేదాన్నని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు కూడా తన పిల్లల పెంపకం, వారి చదువులు, ఇతర యాక్టివిటీస్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటానని చెప్పారు. షూటింగ్ పూర్తయిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంటికి వెళ్లి పిల్లలతో సమయం గడపడానికే ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. పిల్లలతో గడిపే ప్రతీ క్షణం తన ఒత్తిడిని దూరం చేస్తుందని చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..

నేటి తరం నటుల గురించి మాట్లాడుతూ.. యంగ్ జనరేషన్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. ఆయనలోని ఎనర్జీ, డ్యాన్స్, మాస్ అప్పీల్ తనను విశేషంగా ఆకట్టుకుంటాయని అన్నారు. అంతేకాకుండా, ఎన్టీఆర్ బిగ్ బాస్ షో హోస్ట్ చేసిన తీరు , ఆయన మాట్లాడే విధానం ఎంతో అద్భుతంగా అనిపించిందని ప్రశంసించారు. అలాగే మహేష్ బాబుతో ఇటీవల పనిచేశానని, రామ్ చరణ్ తో కూడా నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..

ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు. అలాగే ప్రస్తుతం సినిమాలతోపాటు సీరియల్స్ సైతం చేస్తున్నానని అన్నారు. అలాగే చిరంజీవి కూడా అంతే గ్రేస్ ఉంటుందని, ఆయన ఏదైనా ఒక స్టెప్ చేసినప్పుడు చాలా ఈజీగా కనిపిస్తుందని, మనం కూడా అలా ఈజీగా చేయగలమని అనుకుంటామని తెలిపారు. అయితే, ఆయన చేసిన స్టెప్ మనం చేసినప్పుడు దాని కష్టం తెలుస్తుందని, కింద పడిపోయేంత కష్టంగా ఉంటుందని ఆమని వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

జూనియర్ ఎన్టీఆర్..

Jr Ntr

Jr Ntr

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..