
మేడ్చల్ జిల్లా: ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. బీటెక్ విద్యార్థిని పల్లవి కళాశాల భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం విద్యార్థులంతా కళాశాల నుంచి వెళ్లిపోయిన అనంతరం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
పల్లవి యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు.పల్లవికి ఇటీవలే శ్రీకాంత్ రెడ్డితో వివాహం జరిగింది. శ్రీకాంత్ రెడ్డి చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. . ఘటనపై సమాచారం అందుకున్న ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మృతికి గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.