ఇప్పుడు చెప్పుకోబోయే రెసిపీ పేదోళ్ళ ఇంట్లో ఎవర్ గ్రీన్ వంటకం. ఈ రెసిపీ పచ్చి మిర్చి, కోడిగుడ్డుతో చేస్తే ఆ టేస్ట్ కి ఎవరైనా రెండు ప్లేట్స్ ఆపకుండా లాగిస్తారు. ఇది కారం కారంగా ఉంటుంది. మీరు దీనిని నోట్లో వేసుకోగానే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచి వస్తుంది. పేదోళ్ళ ధమ్ బిర్యానీ ఇదే. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.
పచ్చిమిర్చి ఎగ్ తొక్కుకు కావలసిన పదార్థాలు: పది పచ్చిమిర్చి, రెండు కోడిగుడ్లు, రెండు కప్పుల ఉల్లిపాయలు, 5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు , అర టీ స్పూన్ పసుపు, మీరు మంట ఎక్కువగా తినే వాళ్ళు అయితే కారం కూడా వేసుకోండి , నాలుగు టేబుల్ స్పూన్స్ నూనె , 10 కరివేపాకు ఆకులు, చిన్న కట్ట కొత్తిమీరను తీసుకోవాలి.
పచ్చిమిర్చి ఎగ్ తొక్కు తయారీ విధానం: మీరు ముందుగా పచ్చిమిర్చిని తీసుకుని కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కారం ఎక్కువగా కావాలి అంటే దీనిలో ఇంకా వేసుకుని తినొచ్చు. ఇంకోవైపు నాలుగు వెల్లుల్లి, ఉల్లి పాయ ముక్కలను రోటిలో వేసి బాగా నూరి రెడీ చేసుకోవాలి. ఆ తరువాత కోడిగుడ్లను తీసుకుని బ్రేక్ చేసి దీనిలో వేసుకోవాలి.
పచ్చిమిర్చి ఎగ్ తొక్కు తయారీ విధానం స్టెప్ 1 : ముందుగా గ్యాస్ పొయ్యి వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టి దానిలో నూనె వేసి,
అది వేడయ్యాక దీనిలో ముందుగా కరివేపాకు ఆకులు వేసి వేయించాలి. ఆ దానిని నూరిన తర్వాత ఉల్లిపాయల, పచ్చి మిర్చి పేస్ట్ కూడా వేసి గోల్డ్ కలర్లోకి మారే వరకు వేయించాలి. ఈ సమయంలోనే మంచి వాసన వస్తుంది.
పచ్చిమిర్చి ఎగ్ తొక్కు తయారీ విధానం స్టెప్ 2 : ఇప్పుడు దీనిలో పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా దీనిలో వేసి సన్నని మంటపై వేయించాలి. అప్పుడు గట్టిగా అవుతుంది, ఆ తరవాత మూతపెట్టి 15 నిముషాల పాటు దీనిని పచ్చి వాసన పోయే వరకు ఉడికిస్తే మెత్తగా అవుతుంది. అడుగు అంటకుండా 3 నిముషాల కొకసారి కలుపుతూ ఉండాలి.




