
మాస్ మహారాజా రవితేజ, ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘ఇరుముడి’. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలోని తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధం, అయ్యప్ప స్వామి దీక్ష చుట్టూ తిరిగే భక్తిరస అంశాలు కుటుంబ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇన్నాళ్లు బాక్సాఫీస్ సెన్సేషన్ అయిన ఈ సినిమా తాజాగా పల్లెల్లో పాతకాలపు పద్దతిని తీసుకువచ్చింది. అవును.. గ్రామీణ ప్రాంతాల్లో పాతకాలపు ‘టూరింగ్ టాకీస్’ సంస్కృతిని మళ్లీ గుర్తుకుతెచ్చింది ఇరుముడి మూవీ. నిజానికి ఒకప్పుడు తమ అభిమాన హీరో.. లేదంటే జనాలకు నచ్చిన సినిమా విడుదలైన సమయంలో పల్లెటూర్ల నుంచి ప్రజలు, రైతులు, మహిళలు బస్సులు, ట్రాక్టర్లు కట్టుకుని థియేటర్లకు వచ్చారని వింటుంటాం. కానీ ఇప్పుడు ఇరుముడి మాత్రం ఏకంగా పల్లెలకు వెళ్లింది. ఇందుకు సంబంధించిన క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది.
ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..
గ్రామీణ జనాభా ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టడంతో టాలీవుడ్ క్లాసిక్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. తాజాగా ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. సాధారణంగా ఓటీటీలో ఒక సినిమా వచ్చిందంటే ప్రేక్షకులు తమ ఇళ్లలోని స్మార్ట్‌ఫోన్లు లేదా టీవీలకే పరిమితమై చూస్తుంటారు. కానీ ‘ఇరుముడి’ విషయంలో మాత్రం గ్రామీణ ప్రాంతాల దృశ్యం పూర్తిగా మారిపోయింది.
ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..
ప్రస్తుతం గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండటంతో, పల్లెల్లోని వీధులు, ఊరి మైదానాలు , వినాయక మండపాల వద్ద స్థానికులు పెద్ద ప్రొజెక్టర్లు, LED స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామంలోని పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ ఒకచోట చేరి చాపలపై కూర్చుని సామూహికంగా ఈ సినిమాను తిలకిస్తున్నారు. ఒకప్పుడు ఊరి సెంటర్లలో టెంట్లు వేసి తెల్లటి పరదాలపై సినిమాలు ప్రదర్శించే టూరింగ్ టాకీస్ అనుభూతిని ఈ దృశ్యాలు మళ్లీ ఆవిష్కరిస్తున్నాయి. సినిమాలోని ‘ఇరుముడి కట్టు’, ‘మల్లెపూల పల్లకి’ వంటి పాటలు వస్తున్నప్పుడు ప్రజలు స్క్రీన్ల ముందే ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తుండగా, ఎమోషనల్ క్లైమాక్స్ సన్నివేశాలకు కంటతడి పెడుతున్నారు. ఓటీటీ రిలీజ్ తర్వాత కూడా ఒక సినిమా ఊరంతటినీ ఒకే వేదికపైకి తెచ్చి పండగ వాతావరణాన్ని నింపడం ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది.
ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..
ఇరుముడి సినిమా..
#IrumudiMovie ప్రయాణం ఇంకా ముగియలేదు
థియేటర్లలో ఇంకా కొనసాగుతోంది… బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకుల హృదయాల్లో అదే స్థానం.
#Irumudi ఒక సినిమా మాత్రమే కాదు, ప్రజల మనసుల్లో పాతుకుపోయిన ఎమోషన్.
మాస్ మహారాజా #RaviTeja కి మరో గుర్తుండిపోయే చిత్రం.
#ShivaNirvana https://t.co/Qt5MZH5Jet
— Telugu Rise (@TeluguRise) September 19, 2026
ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..


