జీర్ణ వ్యవస్థ సులభతరం అవుతుంది: జీలకర్రలో థైమోల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణ రసాల ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. ఉదయాన్నే ఈ నీరు తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యలు తగ్గుతాయి. తిన్న ఆహారం త్వరగా అరిగి, మలబద్ధకం దూరమవుతుంది.
బరువు తగ్గడానికి సులువైన మార్గం: శరీర బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి జీలకర్ర నీరు ఒక గొప్ప హెల్త్ డ్రింక్. ఇది శరీర జీవక్రియ రేటును పెంచుతుంది, దీనివల్ల కేలరీలు త్వరగా కరుగుతాయి.
శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపి డీటాక్సీఫైయర్గా పనిచేస్తుంది.
రోగనిరోధక శక్తి పెంపు: జీలకర్రలో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, తరచూ వచ్చే జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి. టైప్-2 మధుమేహంతో బాధపడేవారికి జీలకర్ర నీరు ఎంతో మేలు చేస్తుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సాధారణ స్థితిలో ఉంచడానికి తోడ్పడుతుంది.
చర్మ సౌందర్యం: జీలకర్రలోని విటమిన్-ఈ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి. మొటిమలు,యు చర్మ ఇన్ఫెక్షన్లను అరికట్టడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో జీలకర్ర నీరు కీలక పాత్ర పోషిస్తుంది. రోజువారీ ఆహారంలో దీనిని చేర్చుకోవడం ఎంతో శ్రేయస్కరం.
జీలకర్ర నీటిని ఎలా తయారు చేసుకోవాలి?: ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ జీలకర్ర వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని మరిగించి, వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. కావాలనుకుంటే ఇందులో కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలుపుకోవచ్చు. ప్రతిరోజూ పరగడుపున ఈ సహజ సిద్ధమైన డ్రింక్ తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని సులభంగా కాపాడుకోవచ్చు!




