
కుత్బుల్లాపూర్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుత్బుల్లాపూర్ SOT, దుండిగల్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో 426 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.
దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్డుపై నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు.. ఒరిస్సా నుంచి సోలాపూర్‌కు DCM వాహనంలో గంజాయిని తరలిస్తున్న సమయంలో వాహనాన్ని గుర్తించి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా గంజాయి బయటపడింది.
గంజాయి రవాణాకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు గుర్తించారు. నిందితులను దుండిగల్ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.