
నేచురల్ స్టార్ నాని, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, సాంగ్స్‌తో సినిమాపై హైప్ నెక్స్ట్ లెవల్‌కు చేరగా.. ఇప్పుడు మేకర్స్ వరుస ప్రమోషనల్ కంటెంట్‌తో ఆడియన్స్‌లో మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 24న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ముఖ్యంగా సినిమా కథకు సంబంధించిన చిన్న చిన్న క్లూస్‌ను మాత్రమే టీమ్ రివీల్ చేస్తుండటంతో ‘ది ప్యారడైజ్‌లో అసలు కథేంటి?’ అనే ఆసక్తి మరింత పెరుగుతోంది. ఇటీవల ప్రమోషన్స్‌లో నాని చేసిన ఓ కామెంట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా వైరల్ అవుతోంది. సినిమాలో సోనాలి కులకర్ణి పోషిస్తున్న పాత్ర పేరు ‘సమ్మక్క’. అసలు ఎవరీ సమ్మక్క..? అనే విషయాలు తెలుసుకుందాం..
ఈ పాత్ర గురించి యాంకర్ ప్రదీప్ ప్రశ్నించగా.. నాని ఆసక్తికరంగా స్పందిస్తూ, ‘ది ప్యారడైజ్’కు మరో టైటిల్ పెట్టాలంటే ‘సమ్మక్క’ అని పెట్టొచ్చు.. ఇది ఆమె సినిమా అంటూ చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో అసలు సమ్మక్క ఎవరు? కథలో ఆమె పాత్ర ఎంత కీలకం? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి.
తల్లి–కొడుకు బంధమే కథకు హార్ట్!
ఇప్పటివరకు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ‘ది ప్యారడైజ్’ కేవలం హై వోల్టేజ్ యాక్షన్ మూవీ మాత్రమే కాదు.. తల్లి–కొడుకు ఎమోషనల్ బాండింగ్ చుట్టూ నడిచే కథ. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా సినిమా అసలు ఎమోషనల్ కోర్ తల్లి, కొడుకు బంధమేనని వెల్లడించారు. తల్లి కోసం, తన భూమి కోసం పోరాడే రెబల్‌గా నాని కనిపించనున్నట్లు ఆయన తెలిపారు. ఒక సమాజం తమ ఉనికిని కాపాడుకోవడానికి చేసే పోరాటం కూడా కథలో కీలకంగా ఉంటుందని చెప్పారు.
Natural Star @NameisNani, @TheRaghav_Juyal & @sonalikulkarni talk with @impradeepmachi ❤🔥#TheParadise Gang tells us the stories beyond the screen 💥
Full interaction out tomorrow!#TheParadise GRAND RELEASE WORLDWIDE ON 24.09.26.
Natural Star @NameisNani in an… pic.twitter.com/qsLFQo6gy9
— SLV Cinemas (@SLVCinemasOffl) September 16, 2026
అంతేకాదు.. శ్రీకాంత్ ఓదెల చిన్ననాటి అనుభవాలు, ఆయన చూసిన కొన్ని వాస్తవ సంఘటనల నుంచి ఈ కథకు స్ఫూర్తి లభించినట్లు తెలుస్తోంది. దీంతో రస్టిక్ వరల్డ్, రా ఎమోషన్స్, పవర్‌ఫుల్ యాక్షన్, మాస్ ఎలివేషన్స్ కలిసిన కథను ఈసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారనే ఆసక్తి నెలకొంది.
Sonali Kulkarni as SAMMAKKA? 🤫
If #TheParadise had an alternative title… it would be SAMMAKKA.
— Nani. pic.twitter.com/NZ66XeLHjR
— The Cine Gossips (@TheCineGossips) September 17, 2026
‘దసరా’ కంటే మరో లెవల్‌లో..
నాని–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఇంతకుముందు వచ్చిన ‘దసరా’ మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ సినిమా సక్సెస్ తర్వాత కూడా శ్రీకాంత్ ఓదెల సంతృప్తిగా లేరని నాని ఇటీవల వెల్లడించారు. తాను అనుకున్న ఇంటెన్సిటీని పూర్తిగా తెరపైకి తీసుకురాలేకపోయానని దర్శకుడు తనతో చెప్పినట్లు నాని తెలిపారు. ఈసారి మాత్రం మరింత మ్యాడ్‌నెస్, ఇంటెన్సిటీ, థియేట్రికల్ ఇంపాక్ట్ ఉండేలా కథను సిద్ధం చేశాడని నాని చెప్పడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
ALSO READ : రొమాంటిక్ క్రైమ్ డ్రామాగా ‘డానీ’ టీజర్..
ట్రైలర్ కూడా లేదు.. అయినా హైప్ మాత్రం పీక్స్!
సాధారణంగా పెద్ద సినిమా రిలీజ్‌కు ముందు ట్రైలర్‌తో భారీగా హైప్ క్రియేట్ చేస్తారు. కానీ ‘ది ప్యారడైజ్’ విషయంలో మేకర్స్ మాత్రం డిఫరెంట్ రూట్ తీసుకున్నారు. రిలీజ్‌కు సమయం తక్కువగా ఉండటంతో ట్రైలర్‌ను కట్ చేయలేకపోయామని నాని స్వయంగా చెప్పారు. అయినప్పటికీ ఇప్పటివరకు వచ్చిన ప్రతి కంటెంట్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడం తమ బాధ్యతను మరింత పెంచిందని ఆయన అన్నారు. ప్రేక్షకులను సినిమా మొదటి నుంచి చివరి వరకు అడ్రినలిన్ పంపింగ్ అనుభూతితో థియేటర్ నుంచి బయటకు పంపాలన్నదే తమ టార్గెట్ అని నాని పేర్కొన్నారు.
మరోవైపు ‘ది ప్యారడైజ్’ టీమ్ ప్రమోషన్స్‌ను మరింత స్పీడ్ చేసింది. తాజాగా ‘Welcome to the Era of Three Crows’ అంటూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేయడంతో సినిమాకు సంబంధించిన వరల్డ్‌పై మరోసారి చర్చ మొదలైంది. అయితే కథలోని కీలక అంశాలను మాత్రం మేకర్స్ పూర్తిగా బయటపెట్టకుండా సస్పెన్స్‌ను మెయింటైన్ చేస్తున్నారు.
సెప్టెంబర్ 24న థియేటర్లలోకి..
శ్రీకాంత్ ఓదెల మార్క్ రస్టిక్ టేకింగ్‌కు నాని ఇమేజ్, అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, పవర్‌ఫుల్ యాక్షన్, ఎమోషనల్ స్టోరీ కలవడంతో ‘ది ప్యారడైజ్’పై అంచనాలు భారీగా ఉన్నాయి. నాని కెరీర్‌లోనే డిఫరెంట్ మాస్ ఎక్స్‌పీరియన్స్‌గా ఈ సినిమా నిలుస్తుందా? ‘సమ్మక్క’ పాత్ర చుట్టూ ఉన్న అసలు ట్విస్ట్ ఏంటి? నాని పాత్ర ఎలాంటి పోరాటం చేస్తుంది? అన్నది తెలియాలంటే సెప్టెంబర్ 24 వరకు వెయిట్ చేయాల్సిందే.