Reading Time: 2 minutes

The Paradise Ticket: ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్లపై హాట్ టాపిక్.. నాని వీడియో వెనుక అసలు ముచ్చట ఇదేనా?

Caption of Image.

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’పై ఇప్పటికే భారీ హైప్ ఉంది. సినిమాపై అంచనాలు పెరుగుతున్న సమయంలో ఇప్పుడు టికెట్ రేట్ల అంశం కూడా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా నైజాంలో టికెట్ ధరలు భారీగా పెరగనున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో నాని సైబర్ క్రైమ్, డ్రగ్స్ అవేర్నెస్ వీడియోలు చేయడంతో.. ఈ రెండింటికీ సంబంధం ఉందా? అనే చర్చ మొదలైంది. సినిమాల టికెట్ రేట్ల పెంపునకు అనుమతులు కోరే సమయంలో ప్రభుత్వం విధించే కొన్ని నిబంధనల్లో భాగంగా ప్రజలకు ఉపయోగపడే సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం కూడా ఉంటుంది. దీంతో ‘ది ప్యారడైజ్’ టీమ్ కూడా ఈ విషయంలో ముందుగానే అవసరమైన ప్రక్రియను ప్రారంభించిందనే టాక్ వినిపిస్తోంది. మరో మొత్తం విషయం ఏంటో ఓ లుక్కేద్దాం.. 

నాని అవేర్‌నెస్ వీడియోపై చర్చ!

తాజాగా నాని సైబర్ క్రైమ్‌పై ఓ అవేర్‌నెస్ వీడియో చేశారు. ముఖ్యంగా ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్ యాప్స్‌ను నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని ప్రజలను అలర్ట్ చేశారు. ఆన్‌లైన్‌లో వచ్చే ఇన్వెస్ట్‌మెంట్ ఆఫర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అంతేకాదు.. డ్రగ్స్‌కు నో చెప్పాలంటూ నాని మరో వీడియో ద్వారా గట్టిగా మెసేజ్ ఇచ్చారు.

“Say NO to drugs. Say YES to life” అంటూ నాని ఇచ్చిన సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే Eagle Force 1908కు కాల్ చేయాలని సూచించారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం అందరూ కలిసి పనిచేయాలని నాని కోరారు.

ఈ వీడియో ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్లతో లింక్ చేస్తూ చర్చ జరుగుతోంది. రేట్ల పెంపు కోసం ప్రభుత్వం పెట్టే నిబంధనల్లో భాగంగానే ఈ అవేర్‌నెస్ వీడియోలు చేస్తున్నారా? అనే టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. ప్రస్తుతానికి ఇది ఇండస్ట్రీలో వినిపిస్తున్న ప్రచారం మాత్రమే.

రూ.1000 టికెట్ ప్రచారంలో నిజమెంత?

ఇక నైజాం ఏరియాలో ‘ది ప్యారడైజ్’ టికెట్ ధరలు ఎలా ఉండబోతున్నాయన్నది కూడా ఆసక్తిని పెంచుతోంది. సోషల్ మీడియాలో రూ.600 నుంచి రూ.1000 వరకు రేట్లు ఉండొచ్చనే ప్రచారం జరిగింది. కానీ ఈ స్థాయిలో భారీగా రేట్లు పెంచే ఆలోచన లేదని మూవీ టీమ్ ఇప్పటికే స్పష్టం చేసినట్లు సమాచారం. మరీ ఎక్కువ భారం ప్రేక్షకులపై పడకుండా.. మీడియం రేంజ్‌లో టికెట్ రేట్లు పెంచే ఆలోచనలో ఉన్నట్లు టాక్. అంటే రూ.1000 టికెట్ అంటూ జరుగుతున్న ప్రచారం ఒకవైపు ఉంటే.. మూవీ టీమ్ మాత్రం అంత భారీ పెంపు వైపు వెళ్లడం లేదన్నది మరోవైపు వినిపిస్తున్న మాట.

ముందే ప్రాసెస్ స్టార్ట్ చేశారా?

సాధారణంగా సినిమా రిలీజ్ దగ్గరపడిన తర్వాత టికెట్ రేట్ల పెంపు కోసం హడావుడి కనిపిస్తుంది. కానీ ‘ది ప్యారడైజ్’ టీమ్ మాత్రం ముందుగానే అవసరమైన ప్రాసెస్‌ను స్టార్ట్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగానే నాని చేస్తున్న సోషల్ అవేర్‌నెస్ కార్యక్రమాలపై ఇప్పుడు ఆసక్తి పెరిగింది. దీంతో టికెట్ రేట్ల పెంపు కోసం జరుగుతున్న ప్రాసెస్‌లో భాగంగానే నాని వీడియోలు వచ్చాయా? అన్నది ఇప్పుడు అసలు చర్చగా మారింది.

మొత్తానికి.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై ఉన్న హైప్‌కు తోడు టికెట్ రేట్లు, అవేర్‌నెస్ వీడియోలు, ప్రభుత్వ అనుమతులు వంటి అంశాలు కూడా ఇప్పుడు మూవీ చుట్టూ ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. అధికారికంగా రేట్లు ఎంత వరకు పెరుగుతాయనేది క్లారిటీ రావాల్సి ఉంది.

©️ VIL Media Pvt Ltd.