Reading Time: 2 minutes

జనం దగ్గర డిపాజిట్లకు పైసల్లేవ్.. కానీ అప్పుల కోసం మాత్రం ఎగబడుతున్నరు!

Caption of Image.

జనం దగ్గర దాచుకోవడానికి పైసల్ లేవు.. కానీ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడానికి మాత్రం ఎగబడుతున్నారు. ప్రస్తుతం ఖర్చులు, జనాల అవసరాలు అలా ఉన్నాయ్ మరి. దేశీయ బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుతం ఇదే అత్యంత హాట్ టాపిక్‌గా మారింది. సామాన్యులు, వ్యాపారులు తమ వద్ద ఉన్న డబ్బును బ్యాంకుల్లో దాచుకునేందుకంటే.. అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరగడానికే ఎక్కువగా తిరుగుతున్నారు. ఫలితంగా బ్యాంకింగ్ వ్యవస్థలో లోన్స్, డిపాజిట్ల మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడి.. బ్యాంకులపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతున్నట్లు కేర్ ఎడ్జ్ రేటింగ్స్ రిపోర్ట్ వెల్లడించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మెుదటి 3 నెలల్లో బ్యాంకుల అప్పుల వృద్ధి ఏకంగా 16.5 శాతానికి ఎగబాకి 2 ఏళ్ల గరిష్ట స్థాయిని తాకింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి దేశంలో మొత్తం క్రెడిట్ అవుట్‌స్టాండింగ్ అంటే జనం బ్యాంకులకు చెల్లించాల్సిన డబ్బు రూ. 213 లక్షల కోట్లకు చేరుకుంది. కానీ ఇదే సమయంలో డిపాజిట్లు మాత్రం స్వల్ప వృద్ధితో రూ.256 లక్షల కోట్లుగా ఉన్నాయి. అప్పులు ఇస్తున్న వేగంతో పోలిస్తే డిపాజిట్లు రాకపోవడంతో.. లోన్-టు-డిపాజిట్ రేషియో ఏకంగా 83.3 శాతానికి చేరుకున్నట్లు వెల్లడైంది. సాధారణంగా ఈ సీజన్‌లో పరిస్థితి ఇలా ఉండదని, బ్యాంకింగ్ వ్యవస్థలో డబ్బు లోటు తీవ్రంగా ఉందని ఇది సూచిస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇటీవల చాలా బ్యాంకులు బాండ్స్ జారీ, ఫారెన్ బాండ్ల ద్వారా డబ్బులు అప్పు తెచ్చుకుంటున్నాయి తమ వ్యాపారం కోసం. 

ఈ అప్పుల జోరుకు ప్రధాన కారణం నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు(NBFCs) బ్యాంకులు ఇచ్చిన రుణాలే. బాండ్ ఈల్డ్స్ ఎక్కువగా ఉండటంతో ఎన్‌బీఎఫ్‌సీలు, పెద్ద కార్పొరేట్లు బ్యాంకింగ్ లోన్స్ వైపు మళ్లాయి. పరిశ్రమలకు సంబంధించిన క్రెడిట్ 15.5 శాతం పెరగగా, వ్యక్తిగత రుణాలు 12.7 శాతం వృద్ధి చెందాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల క్రెడిట్ గ్రోత్ 17.3 శాతంగా నమోదైంది. అయితే డిపాజిట్ల సేకరణ మందగించడం వల్ల పీఎస్‌బీలతో పాటు అన్ని బ్యాంకులకు నిధుల సమీకరణ పెద్ద సవాలుగా మారుతోంది.

ALSO READ : గణపయ్యకు మూడు రోజుల్లో రూ.3 కోట్లు డొనేషన్స్..

ఆర్‌బీఐ తీసుకొచ్చిన ఎఫ్‌సీఎన్‌ఆర్(బీ) స్వ్యాప్ సదుపాయం వల్ల బ్యాంకులకు కొంత తాత్కాలిక ఊరట లభించినప్పటికీ.. ఇది శాశ్వత పరిష్కారం కాదని కేర్ ఎడ్జ్ స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో ఇండియన్ హోమ్ సేవింగ్స్ కోసం బ్యాంకులకు పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది. డిపాజిట్లు పెరగకపోతే రానున్న కాలంలో బ్యాంకులను నిధుల కొరత మరింత వేధిస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. 
 

©️ VIL Media Pvt Ltd.