
‘క’ (KA) సినిమాతో కెరీర్‌లో భారీ విజయాన్ని అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నాడు. రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘చెన్నై లవ్ స్టోరీ’ భారీ అంచనాల మధ్య జూలై 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. విడుదలైన తొలి రోజే ప్రేక్షకుల నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ, ఎమోషనల్ సన్నివేశాలు, మ్యూజిక్, హీరో-హీరోయిన్ల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?
ఈ మూవీ ప్రీమియర్స్‌తో పాటు తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.12.3 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద థండరస్ ఓపెనింగ్ నమోదు చేసిందని మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు, విడుదలైన మొదటి రోజే బుక్‌మైషోలో 1.16 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవడం విశేషం. ఒక దశలో గంటకు 10 వేల టికెట్ల విక్రయాలు నమోదవ్వడం సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తికి నిదర్శనం అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీకెండ్ అడ్వాంటేజ్‌తో ఈ సంఖ్యలు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నాయి.
ఈ చిత్రంలో శ్రీ గౌరీ ప్రియ కథానాయికగా నటించగా, ఆదిత్ అరుణ్ కీలక పాత్రలో కనిపించారు. ఎస్‌కేఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. కథ, స్క్రీన్‌ప్లేను సాయి రాజేష్ అందించగా, సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలంగా నిలిచాయి.
₹12.3CR+ WORLDWIDE GROSS (Day 1 & Premieres), A THUNDEROUS OPENING FOR A HEARTFELT LOVE STORY! ❤️
The love from audiences has turned into a phenomenal box office celebration!
Watch the CULT CLASSIC BLOCKBUSTER near you now! ❤️🫶🏻https://t.co/XSeQST4GKB pic.twitter.com/YKtEyE2Z4I
— PRO Suresh (SK Media) (@SKMedia_PR) July 25, 2026
గ్రాస్ ఎంత రావాలంటే?
సుమారు రూ.15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ రూ.23 కోట్ల మేర జరిగినట్లు ట్రేడ్ సమాచారం. ఇప్పటికే ఓటీటీ, ఆడియో హక్కుల సుమారు రూ.9 రాబట్టినట్లు సమాచారం. ఇక థియేట్రికల్ పరంగా పూర్తి స్థాయి విజయాన్ని అందుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.45 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
►ALSO READ | పళ్ళ బురుసు మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్..
అయితే తొలి రోజు కలెక్షన్లు, పాజిటివ్ మౌత్ పబ్లిసిటీ, వీకెండ్ సెలవులు, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వస్తున్న ఆదరణను చూస్తే ఈ లక్ష్యాన్ని సినిమా త్వరగానే చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయనంటున్నారు సినీవర్గాలు. ఇదే జోరు కొనసాగితే ‘చెన్నై లవ్ స్టోరీ’ కిరణ్ అబ్బవరం కెరీర్‌లో మరో కల్ట్ క్లాసిక్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు..