Reading Time: < 1 minute

ఆంధ్రాలో 44 లక్షల ఓట్లు తగ్గాయి.. ఈ జిల్లాల్లోనే ఎక్కువ..!

Caption of Image.

సర్ లో భాగంగా ఏపీలో 44 లక్షల 71 వేల 523 ఓట్లను తొలగించాల్సిన జాబితాలోకి చేర్చినట్లు తెలిపింది ఎన్నికల సంఘం. మొత్తం ఓట్లలో 10.75 శాతం ఓట్లు అన్ కలెక్టబుల్ గా పరిగణించినట్లు తెలిపింది ఈసీ. జులై 31న ఎన్నికల సంఘం విడుదల చేసే ముసాయిదా జాబితాలో అన్ కలెక్టబుల్ గా పరిగణించిన ఓటర్ల పేర్లు ఉండవని తెలిపింది ఈసీ.

తొలగించిన ఓట్ల జాబితాను విడిగా చూపిస్తారని.. దానిపై జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్లు క్లెయిమ్ లు, అభ్యంతరాలు తెలిపే అవకాశం ఉంటుంది. వీటిపై ఎన్నికల సంఘం అధికారులు క్షేత్రస్థాయి విచారణ జరిపి…. సక్రమంగా ఉంటే వారి ఓట్లను అక్టోబరు 3న విడుదల చేయబోయే తుది జాబితాలో ప్రచురిస్తారని తెలిపింది ఈసీ.

అత్యధికంగా ఓట్లు తగ్గింది ఈ జిల్లాలోనే…

రాష్ట్రంలో అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 2 లక్షల 50వేల 579 ఓట్లు తగ్గాయని తెలిపింది ఈసీ. తరువాతి స్థానంలో తిరుపతి జిల్లాలో 2 లక్షల 87 వేల 759, కడప జిల్లాలో 2 లక్షల 44వేల 879 ఓట్లు, విశాఖపట్నంలో 2 లక్షల 39వేల 146 ఓట్లు, గుంటూరులో 2 లక్షల 37వేల 789 ఓట్లు తగ్గినట్లు తెలిపింది ఈసీ. 

తొలగించాల్సిన 44 లక్షల 77వేల 523 ఓట్లలో 29.07 శాతం ( 13 లక్షల 152 ఓట్లు ) ఈ ఐదు జిల్లాల్లోనే ఉన్నట్లు తెలిపింది ఈసీ. మరో 18 జిల్లాల్లో లక్షకు పైగా ఓట్లు తొలగించాల్సిన జాబితాలో ఉన్నట్లు తెలిపింది.

©️ VIL Media Pvt Ltd.