July 14, 2026

సైబర్ హ్యాకింగ్ కు చెక్ పెట్టేలా.. భూభారతికి కొత్త సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సైబర్ హ్యాకింగ్ కు చెక్ పెట్టేలా.. భూభారతికి కొత్త సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
Reading Time: 3 minutes

సైబర్ హ్యాకింగ్ కు చెక్ పెట్టేలా.. భూభారతికి కొత్త సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Caption of Image.
  • పోర్టల్ కోడ్ పూర్తిగా ఎత్తేయాలని సర్కారు నిర్ణయం
  • ధరణి తాలూకు లోపాలు కంటిన్యూ.. 
  • బ్యాక్ ఎండ్​ మార్పులకు అవకాశం
  • తరచూ సాంకేతిక సమస్యల నేపథ్యంలో డెసిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • 2, 3 నెలల్లోనే కొత్త సాఫ్ట్​వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కొత్త పోర్టల్.. అందులోనే సర్వే మ్యాపులు
  • సైబర్ హ్యాకింగ్ తట్టుకునేలా ఏర్పాట్లు
  • ప్రస్తుతం73 లక్షల మంది పట్టాదారులు, కోటిన్నరకు పైగా ఎకరాల డేటా యథాతథం
  • అటవీ, దేవాదాయ, వక్ఫ్ భూముల డిజిటల్ డేటా అంతా అందులోనే..

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భూపరిపాలనను ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పదమైన ‘ధరణి’ పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థానంలో నిరుడు ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రవేశపెట్టిన ‘భూభారతి’ పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇప్పటికీ పాత కోడింగే కొనసాగుతుండటంతో, ఆ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ వ్యవస్థను పూర్తిగా తీసేయాలని  నిర్ణయించింది. కేవలం పైపైన మార్పులతో కాకుండా.. లోపభూయిష్టంగా మారిన పాత టెక్నాలజీకి స్వస్తి పలికి, రాబోయే రెండు మూడు నెలల్లో సరికొత్త సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పూర్తిస్థాయి కొత్త పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తెచ్చేందుకు రెవెన్యూ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ధరణి స్థానంలో సరికొత్త ఆశలతో ‘భూభారతి’ పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రజల ముందుకు తెచ్చినప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల పాత కోడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే కొనసాగించాల్సి వచ్చింది. అయితే, పాత రోగానికి కొత్త రంగు పూసిన చందంగా మారిన ఈ వ్యవస్థ వల్ల రైతులకు ఇంకా ఇబ్బందులు తప్పడం లేదని గ్రహించిన రాష్ట్ర సర్కారు మార్పులు చేయాల్సిందేనని నిర్ణయించింది.

ప్రజల భూములకు పూర్తి భద్రత కల్పిస్తూ, ఎలాంటి లొసుగులు లేని పారదర్శకమైన, సరికొత్త డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్‌‌మెంట్ సిస్టమ్‌‌ను అందుబాటులోకి తెచ్చేందుకు యుద్ధప్రాతిపదికన అడుగులు వేస్తోంది.

ధరణి తాలూకు లోపాలపై సర్కార్ నజర్

గత పాలనలోని లోపాలను సరిదిద్దే ఉద్దేశంతో ప్రభుత్వం ‘భూభారతి’ పేరుతో పోర్టల్‌‌ను ప్రజల ముందుకు తెచ్చినప్పటికీ, సాంకేతిక పరిమితుల వల్ల ఆశించిన ఫలితం రాలేదు. పైకి పేరు మార్చి, కొన్ని కొత్త మాడ్యూల్స్‌‌ను జోడించినప్పటికీ, బ్యాక్ ఎండ్‌‌లో పనిచేసే సాఫ్ట్‌‌వేర్ కోడింగ్ అంతా పాత ధరణి పోర్టల్‌‌దే కావడంతో సాంకేతిక ఇబ్బందులు పదేపదే తలెత్తాయి. అప్పట్లోనే ఈ కోడ్‌‌ను మార్చాలని భావించినా, అది తీవ్రమైన సాంకేతిక చిక్కులతో ముడిపడి ఉండటంతో తాత్కాలికంగా చిన్న మార్పులతోనే సరిపెట్టాల్సి వచ్చింది.  

ధరణి పోర్టల్ తాలూకు లోపాలు అలాగే కొనసాగుతుండటం, రైతులు, ల్యాండ్ ఓనర్లు తరచూ దరఖాస్తుల పెండింగ్ సమస్యలతో సతమతమవుతుండటంతో దీనిపై ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని ప్రభుత్వం భావించింది. ఇటీవల భూ భారతి పోర్టల్‌‌లోనూ హ్యాక్‌‌ చేసి బ్యాక్​ ఎండ్‌‌లో కొన్ని భూముల వివరాలు మార్చినట్టు ప్రాథమికంగా 
గుర్తించారు. దీంతో ఆ కోడ్‌‌ను ఎక్కువ కాలం ఉపయోగించడం మంచిది కాదని, ఈ నేపథ్యంలోనే పాత వ్యవస్థను పూర్తిగా పక్కనబెట్టి సరికొత్త సాంకేతిక వేదికను రూపొందించడమే సరైన మార్గమని కేబినెట్ సబ్ కమిటీ నివేదికల ఆధారంగా తుది నిర్ణయానికి వచ్చారు.

మ్యాపుల ఇంటిగ్రేషన్.. కొత్త సాఫ్ట్‌‌వేర్ సిద్ధం

వచ్చే రెండు నుంచి మూడు నెలల వ్యవధిలోనే సరికొత్త సాఫ్ట్‌‌వేర్‌‌ టెక్నాలజీతో కూడిన కొత్త పోర్టల్‌‌ను వినియోగంలోకి తెచ్చేలా ప్రభుత్వం టైమ్‌‌లైన్‌‌ను నిర్దేశించుకున్నది. ఈ నూతన వ్యవస్థలో భూముల  రిజిస్ట్రేషన్లతోపాటు ప్రతి భూకమతానికి సంబంధించిన ‘ సర్వే మ్యాపులను’ కూడా పోర్టల్‌‌లోనే పొందుపరచనున్నారు. అటు స్టాంప్స్ అండ్​ రిజిస్ట్రేషన్లు, సర్వే శాఖలను ఈ భూ భూరతితో ఇంటిగ్రేట్ చేయనున్నారు.  దీంతో భూముల సరిహద్దు వివాదాలకు దాదాపు తెరపడనుందని, డిజిటల్ మ్యాపింగ్ ఆధారంగా అక్షాంశాలు, రేఖాంశాలతో సహా భూమి కచ్చితమైన కొలతలను రికార్డుల్లో నమోదు చేయనున్నారు. పాత విధానంలో ఉన్న గందరగోళానికి చెక్ పెడుతూ, సామాన్యుడికి సైతం సులభంగా అర్థమయ్యే రీతిలో యూజర్ ఇంటర్‌‌ఫేస్‌‌ను డిజైన్ చేయిస్తున్నారు. సాంకేతిక లోపాల కారణంగా గతంలో దరఖాస్తులు తిరస్కరణకు గురైన వారికి కూడా ఈ కొత్త సాఫ్ట్‌‌వేర్ ద్వారా త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్తున్నారు.

అస్తవ్యస్తంగా అప్లికేషన్ల వ్యవస్థ.. అటకెక్కిన ల్యాండ్ ట్రిబ్యునళ్లు  

భూ భారతి చట్టం అమల్లోనూ అనేక లోపాలు బయటపడుతున్నాయి.  చట్టం దాదాపు 16 నెలలు గడుస్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఈ  చట్టం ప్రకారం భూ వివాదాల త్వరితగతిన పరిష్కారానికి ల్యాండ్ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఇప్పటికీ  సభ్యుల నియామకం, అధికారాల పరిధిపై ఎలాంటి స్పష్టత కరువై వేలాది సమస్యలు పెండింగ్‌‌లో పడిపోయాయి. 

అటు తహసీల్దార్ జారీ చేసే ఆర్డర్లపై మూడంచెల అప్పిలేట్ వ్యవస్థ (ఆర్డీవో, కలెక్టర్, ల్యాండ్ ట్రిబ్యునల్) కాగితాలకే పరిమితం కాగా, భూ భారతి పోర్టల్‌‌లో అప్లికేషన్ల వ్యవస్థ అత్యంత అస్తవ్యస్తంగా తయారైంది. ఎమ్మార్వో, ఆర్డీవోలు ఆమోదించి పంపిన దరఖాస్తులు కలెక్టర్ లాగిన్‌‌లో రెండు నెలలు పెండింగ్‌‌లో ఉంటే ఆటోమేటిక్‌‌గా రిజెక్ట్ అవుతుండటంతో రైతులు మళ్లీ మొదటి నుంచి అప్లై చేసుకోవాల్సి వస్తోంది. పైగా మిస్సింగ్ విస్తీర్ణం కింద రెండు సర్వే నెంబర్లకు దరఖాస్తు చేస్తే, అధికారులు ఒకదానికి మాత్రమే ఎంక్వైరీ రిపోర్ట్ పంపినా ఆ దరఖాస్తును తిరస్కరిస్తున్నారు. 

గతంలో నిర్వహించిన భూ సదస్సులలో వచ్చిన 8 లక్షల 999 దరఖాస్తుల్లో దాదాపు 80 శాతం అప్లికేషన్లను అధికారులు ఎలాంటి కారణాలు చూపకుండానే తిరస్కరించగా, లక్షలాది దరఖాస్తులు అసలు ఆన్‌‌లైన్ ఎంట్రీకే నోచుకోలేదు.  రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌‌ఓఆర్) చట్టంలో పేర్కొనట్టు భూ భారతిలో సవరణల దరఖాస్తుకు ఏడాది గడువు ముగిసినా ఎలాంటి చట్ట సవరణలు లేకుండానే పాత పద్ధతిలోనే వ్యవస్థను నడిపిస్తుండగా, క్షేత్రస్థాయిలో అబాదీ (గృహ స్థలాలు), వ్యవసాయేతర భూముల సర్వే ప్రక్రియ పూర్తిగా విఫలమైంది. 

వీటన్నింటికీ  తోడు కొత్త నిషేధిత జాబితాలోని తప్పుల వల్ల ఏండ్ల క్రితం నాటి పేదల ఇళ్లు, అసైన్డ్ భూములు, తాతల కాలం నాటి పట్టా భూములు సైతం నిషేధిత లిస్టులోకి చేరిపోవడంతో, అత్యవసరాలకు అమ్ముకోలేక, బ్యాంకు లోన్లు పొందలేక సామాన్యులు అల్లాడిపోతున్నారు. చట్టంలో పేర్కొన్న ఉచిత లీగల్ ఎయిడ్ హామీని సైతం తుంగలో తొక్కారు.

డేటా సురక్షితం.. సైబర్ దాడులకు చెక్

సాంకేతిక మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలోని భూ యజమానులకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రభుత్వం అత్యంత అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 73 లక్షలకుపైగా పట్టాదారులు, వారి పరిధిలోని కోటిన్నర ఎకరాలకుపైగా ఉన్న భూముల డిజిటల్ డేటా అంతా పూర్తిగా సురక్షితంగా ఉంటుందని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. కొత్త సాఫ్ట్‌‌వేర్‌‌లోకి మారే ప్రక్రియలో పాత రికార్డులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావితం కాకుండా బ్యాకప్ వ్యవస్థలను సిద్ధం చేశారు. 

దీంతోపాటు డేటా భద్రతకు పెద్దపీట వేస్తూ, సైబర్ దాడులు  హ్యాకింగ్ ప్రయత్నాలను సమర్థవంతంగా తట్టుకునేలా అత్యున్నత రక్షణ ప్రమాణాలతో గ్లోబల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్‌‌ను రూపొందిస్తున్నారు. ఎలాంటి డేటా ట్యాంపరింగ్ జరగకుండా బ్లాక్‌‌చైన్ తరహా భద్రతా ఫీచర్లను కూడా ఈ కొత్త పోర్టల్‌‌లో అనుసంధానం చేసే అంశాన్ని సాంకేతిక నిపుణుల కమిటీ పరిశీలిస్తోంది. భూభారతి నూతన పోర్టల్‌‌లో కేవలం పట్టా భూముల రికార్డులకే పరిమితం కాకుండా, ప్రభుత్వ  వివాదాస్పద భూముల రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని అటవీ భూములు, దేవాదాయ శాఖ పరిధిలోని భూములు, వక్ఫ్ బోర్డు ఆస్తులతోపాటు ప్రభుత్వానికి చెందిన ఇతర కేటగిరీల భూముల డిజిటల్ డేటా మొత్తాన్ని ఈ నూతన పోర్టల్‌‌తో అనుసంధానం చేయనున్నారు.

©️ VIL Media Pvt Ltd.