July 14, 2026

యాదాద్రి: ‘సర్’ పేరుతో బంగారు గొలుసు చోరీ

యాదాద్రి: ‘సర్’ పేరుతో బంగారు గొలుసు చోరీ
Reading Time: < 1 minute

యాదాద్రి: ‘సర్’ పేరుతో బంగారు గొలుసు చోరీ

Caption of Image.

యాదాద్రి(బీబీనగర్), వెలుగు: సర్​ పేరుతో ఎన్యూమరేషన్​ ఫారం చెక్​ చేస్తామని ఇద్దరు యువకులు కలిసి ఓ వృద్ధురాలి బంగారు గొలుసు తీసుకొని పరారయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి జిల్లా బీబీనగర్​కు చెందిన ఆండాలు ఇంటికి ఆదివారం ఇద్దరు గుర్తు తెలియని యువకులు వచ్చారు. సర్​ ఎన్యూమరేషన్​ ఫారం చెక్​ చేస్తామని, ఇందుకోసం ఫొటో తీసుకుంటామని చెప్పారు. 

మెడలో బంగారం ఉంటే ఫొటో సరిగా రాదని చెప్పి గొలుసును తీయించి తీసుకున్నారు. అనంతరం వృద్ధురాలి దృష్టి మరల్చి రూ.4.50 లక్షల విలువైన బంగారు గొలుసుతో పరారవడంతో ఆండాలు కన్నీరుమున్నీరవుతోంది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

©️ VIL Media Pvt Ltd.