జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కీడు సోకిందని ఊరంతా ఖాళీ!Caption of Image.
జమ్మికుంట, వెలుగు: కీడు సోకిందని ఊరంతా ఖాళీ చేసిన ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో జరిగింది. జమ్మికుంట మున్సిపాలిటీలోని 13, 14 వార్డుల్లో నెల రోజుల వ్యవధిలో వరస మరణాలు సంభవించడంతో కీడు సోకిందని భావించి కుల పెద్దలు కీడు వంటలకు వెళ్లాలని మూడు రోజుల కింద డప్పు చాటింపు వేయించారు.
ఇందులోభాగంగా ఆదివారం తెల్లవారుజామునే వార్డు ప్రజలంతా సమీప గ్రామమైన ఇల్లందకుంటకు వెళ్లి అక్కడే భోజనాలు చేసి సాయంత్రం వరకు అక్కడే ఉండి చీకటి పడ్డ తర్వాత తిరిగి వచ్చారు. గతంలో ఇలాగే జరిగితే కీడు వంటలకు వెళ్లడంతో మరణాలు ఆగిపోయాయని, ఆ నమ్మకంతోనే వెళ్లామని కాలనీవాసులు తెలిపారు.