ఫోన్ స్క్రీన్ లైట్ వల్ల స్లీప్ డిస్టర్బ్ అవుతుందా? క్లారిటీ ఇక్కడ!
రోజంతా కష్టపడి అలసిపోయి బెడ్‌పైకి చేరగానే చేతిలోకి ఫోన్ వస్తుంది. ఒక్క ఐదు నిమిషాలు అనుకుంటూనే గంటలు గడిచిపోతాయి. రాత్రిళ్లు ఫోన్ స్క్రీన్‌ను అలా చూస్తూనే ఉండడం వల్ల మన నిద్ర పూర్తిగా దూరమవుతుందని మీకు తెలుసా? ఫోన్ లైట్ మన మెదడును ఎలా మోసం చేస్తుంది, దానివల్ల వచ్చే ఆరోగ్య సమస్యలేంటో క్లియర్ గా తెలుసుకుందాం.
మెలటోనిన్ హార్మోన్ దెబ్బతింటుంది: మన శరీరంలో టైమ్‌కి నిద్ర రావడానికి ‘మెలటోనిన్’ అనే హార్మోన్ చాలా అవసరం. చీకటి పడగానే ఇది రిలీజ్ అవుతుంది. కానీ మనం పడుకునే ముందు ఫోన్ వాడితే, దాని స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ ఈ హార్మోన్ ఉత్పత్తిని నొక్కేస్తుంది. ఇక దీనివల్ల మన మెదడుకు ఇంకా పగలే అనుకుని, నిద్రను వాయిదా వేస్తుంది.
మెదడుకు రెస్ట్ దొరకదు: రాత్రిపూట సోషల్ మీడియా రీల్స్ చూడటం, మెసేజ్‌లు చేయడం లేదా వార్తలు చదవడం వల్ల మన మెదడు అలసిపోవడానికి బదులు మరింత యాక్టివ్‌గా మారుతుంది. ఆసక్తికరమైన కంటెంట్, నోటిఫికేషన్ల వల్ల బ్రెయిన్ రిలాక్స్ అవ్వదు. ఇక దీనివల్ల కళ్లు మూసినా త్వరగా నిద్రపట్టక ‘ఇన్సోమ్నియా’ (నిద్రలేమి) సమస్య మొదలవుతుంది.
నిద్ర నాణ్యత తగ్గిపోతుంది: ఒకవేళ మీరు ఆలస్యంగా నిద్రపోయినా, ఆ నిద్రలో గాఢత ఉండదు. నిద్ర మధ్యలో పదే పదే మెలకువ రావడం జరుగుతుంది. ఇక దీనివల్ల మరుసటి రోజు ఉదయం లేవగానే ఒళ్లంతా నొప్పులు, తీవ్రమైన అలసట, నీరసం మరియు ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
మరి ఏం చేయాలి?: ఈ సమస్య నుంచి బయటపడాలంటే మీ అలవాట్లను కాస్త మార్చుకోవాలి. రాత్రి పడుకోవడానికి కనీసం 30 నుండి 60 నిమిషాల ముందే ఫోన్‌ను పక్కన పెట్టేయాలి. ఇక ఒకవేళ అత్యవసరంగా ఫోన్ వాడాల్సి వస్తే, స్క్రీన్‌లో ‘నైట్ లైట్’ లేదా ‘రీడింగ్ మోడ్’ ఆన్ చేసుకోవడం చాలా మంచిది.
ఇక ఫోన్ మన జీవితంలో భాగమే కావచ్చు, కానీ అది మన నిద్రను మింగేయకూడదు. పడుకునేటప్పుడు ఫోన్‌ను బెడ్‌పై కాకుండా కాస్త దూరంగా టేబుల్‌పై పెట్టండి. ఈ చిన్న మార్పు మీ నిద్ర నాణ్యతను పెంచి, మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది.
గమనిక: రాత్రిపూట డిజిటల్ స్క్రీన్లకు ఎంత దూరంగా ఉంటే, మీ శారీరక, మానసిక ఆరోగ్యం అంత మెరుగ్గా ఉంటుంది. మంచి నిద్ర కోసమే ఈ చిన్న జాగ్రత్తలు!
The post ఫోన్ స్క్రీన్ లైట్ వల్ల స్లీప్ డిస్టర్బ్ అవుతుందా? క్లారిటీ ఇక్కడ! appeared first on Manalokam – Latest Telugu News & Updates.