July 14, 2026

MP వంశీకృష్ణ కేంద్రంతో కొట్లాడి తెలంగాణకు తాడిచెర్ల మైన్ సాధించిండు: మంత్రి వివేక్

MP వంశీకృష్ణ కేంద్రంతో కొట్లాడి తెలంగాణకు తాడిచెర్ల మైన్ సాధించిండు: మంత్రి వివేక్
Reading Time: < 1 minute

MP వంశీకృష్ణ కేంద్రంతో కొట్లాడి తెలంగాణకు తాడిచెర్ల మైన్ సాధించిండు: మంత్రి వివేక్

Caption of Image.

మంచిర్యాల: ఎంపీ వంశీకృష్ణ కేంద్రంతో కొట్లాడి తెలంగాణకు తాడిచెర్ల మైన్ సాధించాడని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. అతడి కృషి వల్లే కేంద్రం ప్రభుత్వం సింగరేణికి తాడిచెర్ల మైన్ కేటాయించిందన్నారు. ఈ మైన్‎తో స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. 

దండేపల్లి మండలం లింగాపూర్‎లో కాంగ్రెస్ నాయకులు భానవత్ నీలయ్య తండ్రి బనావత్ నర్సింహా ఇటీవల అనారోగ్యంతో మరణించగా సోమవారం (జులై 13) వారి కుటుంబ సభ్యులను మంత్రి వివేక్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్లకు కక్కుర్తి పడి తాడిచర్ల మైన్‎ను ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పిందన్నారు. 

►ALSO READ | మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీ విద్యార్థులకు ప్రత్యేక మెగా జాబ్ మేళా

తాను ఎంపీగా ఉన్నపుడు తాడిచర్ల మైన్‎ను ప్రైవేట్ పరం చేయొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరానని గుర్తు చేశారు. కమీషన్‎ల కోసం కాళేశ్వరం కట్టి కేసీఆర్ ఫ్యామిలీ ప్రజాదనాన్ని లూటి చేసిందని విమర్శించారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో అన్ని వందల కోట్ల రూపాయలు చేరాయని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో దోపిడీ రాజ్యమేలిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

©️ VIL Media Pvt Ltd.