TG20 లీగ్ ఫైనల్: మోస్తారు స్కోర్‌కే పరిమితమైన ఖమ్మం.. హైదరాబాద్ టార్గెట్ ఎంతంటే..?

హైదరాబాద్: ప్రతిష్టాత్మక టీజీ20 లీగ్‌లో భాగంగా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్‌తో జరుగుతోన్న ఫైనల్ మ్యాచులో ఖమ్మం ఏసెస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఖమ్మం మోస్తారు స్కోర్‌కే పరిమితమైంది.
ఖమ్మం బ్యాటర్లలో మికిల్ జైస్వాల్ (65) రాణించగా.. కొడిమాల హిమతేజ (31), విద్యానంద రెడ్డి ఎల్లాల (20) ఫర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లు అంచనాల మేర రాణించకపోవడంతో ఖమ్మం భారీ స్కోర్ చేయలేకపోయింది.
హైదరాబాద్ బౌలర్లలో వుట్కూరి యష్‌వీర్ గౌడ్ 3 వికెట్లతో చెలరేగగా.. దేవ్ మెహతా, అజయ్‌దేవ్ గౌడ్ చెరో రెండు వికెట్లు తీశారు. అఖిల్ రాథోడ్ ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం 158 పరుగుల లక్ష్యంతో హైదరాబాద్ ఈ చాంపియన్స్ ఛేజింగ్‌కు దిగింది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు టీజీ20 లీగ్ ఫస్ట్ ఎడిషన్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించనుంది.