Reading Time: < 1 minute
Allu Arjun And Lokesh Kanagaraj Movie Aa23 Cancelled Here Is The Truth Behind Rumors

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఏడాది ఆరంభంలోనే ఈ క్రేజీ కాంబినేషన్‌ను అధికారికంగా ప్రకటించింది. అయితే తాజాగా ఈ మోస్ట్ అవేటెడ్ మూవీపై రకరకాల ఊహగానాలు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

హీరో అల్లు అర్జున్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, అందువల్ల ఈ సినిమా ఆగిపోయే ఛాన్స్ ఉందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది  లోకేష్ ఇప్పటికే ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసినప్పటికీ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ హోల్డ్‌లో పడిందంటూ వస్తున్న రూమర్స్ బన్నీ ఫ్యాన్స్‌ను కాస్త కంగారు పెట్టాయి. ఈ వార్తలపై ఇరువురికి చెందిన యూనిట్ ను ఆరాతీయగా.. ఈ రూమర్లలో ఎలాంటి నిజం లేదట. అంతా అనుకున్నట్లే సాగుతోందని. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం సైలెంట్‌గా జెట్ స్పీడ్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే ఈ ఏడాది ఆఖర్లోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లే అవకాశం ఉంది.ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న రాకా సినిమా షూటింగ్ పూర్తి కాగానే లోకేష్ ప్రాజెక్ట్ పైనే ఫోకస్ పెట్టనున్నారు. ఈ క్రేజీ సినిమాకు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ కాంబినేషన్ రూమర్లకు చెక్ పెడుతూ మేకర్స్ ఎప్పుడు అఫీషియల్ క్లారిటీ ఇస్తారో చూడాలి.