July 17, 2026

Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం

Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
Reading Time: 2 minutes
Raghav Chadha Vs Aap Row Saurabh Bhardwaj Reaction Political Crisis

ఆమ్ ఆద్మీ పార్టీలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం ఇంకా చల్లారలేదు. తిరుగుబాటు ఎంపీలపై ఆప్ నేతలు విరుచుకుపడుతున్నారు. తాను ఇప్పటి వరకు తప్పుడు పార్టీలో ఉన్నానని రాఘవ్ చద్దా వ్యాఖ్యానించారు. దీంతో ఆ వ్యాఖ్యలపై సౌరభ్ భరద్వాజ్ ధ్వజమెత్తారు. రాజ్యసభ ఎంపీని చేయడం వల్లే మీకు పెళ్లైందని.. లేదంటే పిల్లను కూడా ఇచ్చేవారే కాదన్నారు.

ఇక పార్టీలు మారడాన్ని రాఘవ్ చద్దా ఉద్యోగాలతో పోల్చడంపై కూడా కౌంటర్ ఇచ్చారు. ‘‘మనం ఉద్యోగాలు మారినప్పుడు లేదా ఒక కంపెనీలో పనిచేసినప్పుడు సిద్ధాంతంతో ఎలాంటి సంబంధం ఉండదు. కానీ మీరు సిద్ధాంతం కారణంగానే ఒక పార్టీలో చేరి.. దానిలోనే జీవిస్తారు..’’ అని అన్నారు. అయినా ‘‘ప్రజలు ఉద్యోగాలు మారినప్పుడు కూడా వారు తమ మాతృ సంస్థకు వ్యతిరేకంగా కుట్ర చేయరు.’’ అని అన్నారు. పార్టీ మారే హక్కు ఉంది.. కాదనడం లేదు.. కానీ అందుకు భిన్నంగా కుట్రలు పన్నడం ఏంటి? అని ప్రశ్నించారు. ఏడాదికిపైగా బీజేపీతో కలిసి కుట్రలు పన్నుతారా? అని నిలదీశారు.

మధ్యతరగతి సమస్యలను లేవనెత్తే యువ రాజకీయ నాయకుడిగా తటస్థను కొనసాగించేందుకు ఏడాదికి పైగా కేంద్ర ప్రభుత్వంతో కుట్ర పన్నారని ఆరోపించారు. విమానాశ్రయ విక్రేతలు, మొబైల్ రీఛార్జ్, పితృత్వ సెలవు, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌ల్లో పనిచేసే గిగ్ వర్కర్లకు సంబంధించిన విషయాలతో సహా లేవనెత్తిన అనేక సమస్యలు ఒక అవగాహనలో భాగమని పేర్కొన్నారు.

రాఘవ్ చద్దా
ఇక ఆప్ నుంచి విమర్శలు రావడంతో రాఘవ్ చద్దా స్పందిస్తూ.. 15 ఏళ్లుగా పార్టీలో పని చేశానని.. వ్యవస్థాపక సభ్యుడిని అని పేర్కొన్నారు. కెరీర్ కోసం రాజకీయాల్లోకి రాలేదని.. 15 ఏళ్ల ఉజ్వల భవిష్యత్‌ను పార్టీకి అంకితం చేసినట్లుగా చెప్పుకొచ్చారు. సరైన వ్యక్తినే కానీ.. తప్పుడు పార్టీలో ఉన్నానని అర్థమైందన్నారు. భయంతో కాదు.. నిరాశ, నిస్పృహ, అసహ్యంతోనే బయటకు వెళ్లిపోయినట్లుగా చెప్పకొచ్చారు. ఏడుగురు ఎంపీలు వెళ్లిపోయారంటేనే అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Raghav Chadha (@raghavchadha88)