
తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్ , ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక TG EAPCET-2026 పరీక్షా షెడ్యూల్‌ను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) అధికారికంగా విడుదల చేసింది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి తరపున కన్వీనర్ డాక్టర్ కె. విజయ కుమార్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది మొత్తం 3,01,194 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.
KTR: “పీసీ ఘోష్ కాదు, ఇది పీసీసీ నివేదిక”.. బీఆర్ఎస్ వాదనే నిజమైందన్న కేటీఆర్..
ఇందులో ఇంజనీరింగ్ విభాగానికి అత్యధికంగా 2,10,308 మంది, అగ్రికల్చర్ , ఫార్మసీ విభాగానికి 90,569 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రెండు విభాగాలకు కలిపి 317 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (CBT) ప్రతిరోజూ రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం సెషన్ 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 3:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు జరుగుతాయి.
షెడ్యూల్ ప్రకారం, అగ్రికల్చర్ , ఫార్మసీ విభాగం పరీక్షలు మే 4 , 5 తేదీల్లో జరగనుండగా, ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు మే 9 నుండి 11వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ ద్వారా నిర్ణీత తేదీల నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అగ్రికల్చర్ , ఫార్మసీ అభ్యర్థులకు ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 11:00 గంటల నుండి, ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఏప్రిల్ 27వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటల నుండి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ అన్-ఎయిడెడ్ , అనుబంధ వృత్తిపరమైన కళాశాలల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష అత్యంత కీలకమైనందున, విద్యార్థులు షెడ్యూల్ ప్రకారం సిద్ధం కావాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు www.eapcet.tgche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
TG Cabinet Meeting : రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. హైకోర్టు తీర్పుపై చర్చ
