జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్యమైన గ్రహాలు, రాశులు వాటి గమన స్థానాలను మార్చుకున్నప్పుడు కొన్ని రాశుల వారి మీద ప్రత్యేక ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. బుధుడు తన స్థానం మార్చుకోవడం రెండు రాశుల వారికి కలిసి రానుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణుల చెబుతున్నారు.
బుధుడు మరి కొద్దీ రోజుల్లో తన మార్గం నుండి ఉత్తరం వైపు లేదా దక్షిణం వైపు తన స్థానాన్ని మార్చుకున్నప్పుడు 12 రాశుల వారి మీద ప్రభావం చూపనుంది. దీనిని జ్యోతిష్య శాస్త్రంలో బుధ క్రాంతి వృత్త పరివర్తన్ అని పిలుస్తారు. బుధ సంచారం వలన రెండు రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం
మకర రాశి : బుధ సంచారం వలన మకర రాశి వారికి గుడ్ డేస్ రానున్నాయి. ఇంకా కోర్టుకు సంబంధించిన సమస్యలు కూడా మెరుగుపడతాయి. ఇంకా ఈ సమయంలో ఏం కోరుకున్నా కూడా జరుగుతుంది. కెరీర్లో ముందుకు దూసుకెళ్తారు. ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. మీ కుటుంబం సభ్యుల నుంచి గుడ్ న్యూస్ లు వింటారు. ఈ రాశి వారు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు.
కన్యా రాశి: కన్యా రాశి వారికి బుధుడు వలన జీవితమే మారుతుంది. బుధుడు తన దిశను మార్చుకోవడం వలన ఈ రాశి వారికీ మంచి రోజులు రానున్నాయి. పట్టిందల్లా బంగారమే అన్నట్లు ఉంటుంది. జీవితంలో అనుకున్న పనులు చేస్తారు. అప్పుల నుంచి బయట పడతారు. కొత్త పనులు మొదలు పెట్టడానికి ఇదే మంచి. కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది. ఇంకా ఈ రాశి వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)




