
హీరోయిన్స్ సినిమాల కోసం ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది హీరోయిన్స్ చిన్న చిన్న పాత్రలకే పరిమితం అవుతుంటే మరికొంతమంది మాత్రం హీరోలకు సమానంగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. కేవలం గ్లామర్ పరంగానే కాదు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేసి అలరిస్తున్నారు. అలాగే కొంతమంది హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. హీరోయిన్స్ గా బిజీగా ఉంటూనే ఛాన్స్ దొరికినప్పుడల్లా స్పెషల్ సాంగ్స్ లో నటిస్తూ అలరిస్తున్నారు. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ చాలా స్పెషల్. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఆమె తోప్ హీరోయిన్. తెలుగులో దాదాపు అందరు హీరోల సరసన నటించి మెప్పించింది ఈ అమ్మడు. ఆమె ఎవరంటే..
ఇది కూడా చదవండి : Pokiri: ఎన్నాళ్లకు కనిపించింది మావ..! పోకిరి రౌడీ గర్ల్ ఎంత మారిపోయింది..!!
తెలుగులో తిరుగులేని హీరోయిన్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు రమ్యకృష్ణ. తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణించింది రమ్యకృష్ణ. తెలుగు, తమిళ్ భాషల్లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ. హీరోయిన్ గా రాణించిన రమ్యకృష్ణ ఇప్పుడు సహాయక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది. బాహుబలి సినిమాతో మరోసారి రమ్యకృష్ణ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్స్ లోనూ అదరగొట్టారు.
ఇది కూడా చదవండి : తెలుగులో తిరుగులేని హీరోయిన్.. పగబట్టి కెరీర్ నాశనం చేసిన హీరో.. చనిపోయాక శవాన్ని కూడా వదల్లేదు..
అయితే రమ్యకృష్ణ తెల్లవారితే పెళ్లి పెట్టుకొని కూడా స్పెషల్ రాత్రంతా స్పెషల్ సాంగ్ కు డాన్స్ చేశారట. ఈ విషయాన్నీ ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రమ్యకృష్ణ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే రమ్యకృష్ణ పెళ్లి రోజు ముందు కూడా షూటింగ్ లో పాల్గొన్నారట. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సింహాద్రి సినిమాలో రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ షూటింగ్ గురించి రమ్యకృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బిజీ షెడ్యూల్ కారణంగా సింహాద్రి చిత్రంలో చిన్నది అమ్మే చీకులు కావాలా సాంగ్ ని నైట్ మొత్తం షూట్ చేయాల్సి వచ్చింది. తెల్లవారితే నా పెళ్లి ఉంది. అయినా కూడానేను రెస్ట్ తీసుకోలేదు. రాత్రి 2 గంటల వరకు షూట్ చేసి ఆ తర్వాత పెళ్ళికి వెళ్ళాను అని రమ్యకృష్ణ తెలిపారు. కొన్నిసార్లు వర్క్ కోసం ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.