Reading Time: < 1 minute
Venkatesh Kalyan Ram Anil Ravipudi Multistarrer Cast Crew Release Date

Anil Ravipudi Multistarrer: విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ కలయికలో దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కి సంబంధించి తాజాగా బయటకు వచ్చిన లీడ్ కాస్ట్ వివరాలు సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీ మరియు యాక్షన్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఇందులో ఇద్దరు హీరోల సరసన క్రేజీ హీరోయిన్లు జోడీ కట్టనున్నారు. వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కల్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్లుగా నటించనున్నారు.

Also Read :Allu Arjun : కొత్తింటికి అల్లు అర్జున్?

ఇప్పటికే ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర్ వరప్రసాద్ గారు వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఐదవ సినిమా ఇది. అందుకే ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ నెలకొంది. అనిల్ రావిపూడిని దర్శకుడిగా పరిచయం చేసిన ‘పటాస్’ హీరో కల్యాణ్ రామ్, దాదాపు పదేళ్ల తర్వాత మళ్ళీ అనిల్ దర్శకత్వంలో నటిస్తుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ జూన్ 2026 నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ పక్కా ప్లాన్‌తో ఉన్నారు.