రోజూ నార్మల్ టిఫిన్స్ తిని బోర్ కొట్టిందా? అయితే, ఈ రెండు రకాల టిఫిన్స్ ను మీ డైట్ లో చేర్చుకోండి. ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇంకా వీటిని తినడం వలన మోకాళ్ళు, నడుము నొప్పులు కూడా తగ్గుతాయి. అలాగే, ఇది రక్తం తక్కువగా ఉన్నవారికి ఓ వరం అని చెప్పాలి. మరి, ఇంకెందుకు లేట్ ఆ టిఫిన్స్ ఏంటో ఇక్కడ చూద్దాం..
రాగి ఇడ్లీలు చిన్న పిల్లలకు చాలా మంచివి. ఎందుకంటే పిల్లలలకు కావాల్సిన ప్రోటీన్, ఐరన్, ఫైబర్ ఉన్నాయి. మీరు ఉదయం వీటిని తినడం వలన మధుమేహ నియంత్రణ, జీర్ణక్రియ పనితురును కూడా ఇది మెరుగుపరుస్తుంది. ఇంకా ఇవి కొద్దిగా రేట్ ఎక్కువగా ఉంటాయి. అయితే, ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి ఇది సరైన ఎంపిక అని చెప్పొచ్చు.
ముందుగా రాగి పిండిని తీసుకుని దానిలో ఒక కప్పు ఇడ్లీ రవ్వ, కొద్దిగా పెరుగు, ఉప్పును వేసి పిండిని బాగా కలిపి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. దీనిని ఇడ్లీ ప్లేట్స్‌లో పిండిని పోసి ఆవిరిలో మీద 20 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి. వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని చట్నీ లేదా టమోటో చట్నీతో తింటే టేస్ట్ అదిరిపోతోంది.
రాగి దోశను ఎంతో మంది ఇష్టంగా తింటారు అలాగే, ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా దీనిలో శరీరానికి కావాల్సిన
పోషకాలు కాల్షియం, ఫైబర్ ఉన్నాయి. వీటిని తినడం వలన బరువు ఈజీగా తగ్గుతారు, అలాగే మధుమేహం కూడా తగ్గుతుంది.
ఇంకా ఇది ఎముకలను కూడా ఇది బలపరుస్తుంది. అలాగే, ఇది రక్తహీనత సమస్యను సులభంగా తగ్గించడానికి హెల్ప్ అవుతుంది
ముందుగా రాగి పిండిని తీసుకుని దానిలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, నాలుగు మిర్చి ముక్కలు , రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి మరి జోరుగా కాకుండా నార్మల్ గా పిండిని కలపాలి. ఆ తర్వాత పాన్ మీద పిండిని పలుచగా పోసి మూడు టేబుల్ స్పూన్స్ నూనె వేసి కరకరలాడేలా వరకు బాగా వేయించాలి. ఒక వైపు కాలిన తరవాత రెండు వైపులా ఈ దోసను బాగా కాల్చిన తరవాత వేడి వేడి చట్నీతో తింటే రుచితో అదిరిపోతోంది.




