పచ్చి జీడీపప్పు, బీరకాయ కూరకు కావాల్సిన పదార్థాలు: రెండు కప్పుల బీరకాయ ముక్కలు, ఒక కప్పు పచ్చి జీడీపప్పు, ఒక పెద్ద ఉల్లిపాయ, మూడు పచ్చిమిర్చి, రెండు పెద్ద టమోటాలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , అర టేబుల్ స్పూన్ పసుపు,
ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు , రెండు టేబుల్ స్పూన్స్ నూనె, అర టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, పోపు కోసం
కరివేపాకు, కొత్తిమీరను తీసుకోవాలి.
కూరను ఇలా తాలింపు చేయాలి: గ్యాస్ వెలిగించి దాని మీద పాన్ పెట్టి అది బాగా వేడయ్యాక అర టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత నాలుగు కరివేపాకు ఆకులు వేసి పచ్చి వాసన వచ్చే వరకు బాగా వేయించాలి. కట్ చేసిన ఉల్లిపాయ ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బంగారు కలర్ వచ్చే వరకు బాగా వేయించాలి.
ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయే వరకు వేయించాలి. టమోటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వాటిని బాగా ఉడికించాలి. ఆ తర్వాత పసుపు, కారం, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు బీరకాయ ముక్కలు, పచ్చి జీడీపప్పు వేసి మిక్స్ అయ్యేలా కలపాలి.
బీరకాయముక్కలు, జీడీ పప్పును ఇలా మగ్గించాలి: లో నీళ్లు ఉంటాయి కాబట్టి మరి ఎక్కువగా నీళ్లు అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టి మీడియం మంటపై 20 నిమిషాల పాటు ఉడికించాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలా చేస్తే బీరకాయ మెత్తగా అవుతుంది. ఇంకా జీడీపప్పు కూడా తినడానికి మంచిగా ఉంటుంది.
చివర్లో రుచికి సరిపడా ఉప్పు, చివరగా కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించేయాలి. పచ్చి జీడీపప్పులో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. ఇంకా బీరకాయ కూడా బాడీలో వేడిని తగ్గిస్తుంది. మోకాళ్ళ నొప్పులు, జీర్ణ సమస్యలను కూడా తగ్గించడంలో ఇది
సహాయపడుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.




