మే నెలలో అనేక గ్రహాలు కలయికలు జరపడమే కాకుండా, సంచారం చేయనున్నాయి. అదే విధంగా గ్రహాల కలయిక, నక్షత్ర సంచారం, గ్రహ సంచారం వలన రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా సూర్య, కుజ గ్రహాల సంచారం వలన మే నెలలో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది 12 రాశులపై ప్రభావం చూపగా, నాలుగు రాశుల వారికి మాత్రం ఊహించని విధంగా లక్కు తీసుకొస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో చూసేద్దాం.
కుంభ రాశి : కుంభ రాశి వారికి గ్రహాల సంచారం, బుధాదిత్య రాజయోగం వలన అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. అంతే కాకుండా చాలా రోజుల నుంచి ఎవరు అయితే స్థిరాస్థి కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో, వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ప్రతి రోజూ చాలా ఆనందంగా గడుపుతారు.
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే హైక్ మాత్రమే కాకుండా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. చాలా ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పనులన్నీ చాలా సవ్యంగా త్వరగా పూర్తి అవుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారి ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వీరు ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. సమాజంలో వీరికంటూ ఓ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేవారికి ఇది మంచి సమయం. విదేశీ వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
మిథున రాశి : మిథున రాశి వారికి ఊహించని విధంగా సంపద పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోతాయి. ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సమాజంలో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్, పండితుల సమాచారం మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.




