అందం అభినయం ఉన్న అదృష్టం లేని భామలు టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. ఆ లిస్ట్ లో మొదటి వారసులో ఉంటుంది నిధి అగర్వాల్. ఈ అందాల భామ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చిన విషయం తెలిసిందే. తొలి సినిమా నాగ చైతన్యతో చేసింది.
తెలుగులో వరుసగా సినిమాలు చేసిన ఈ అమ్మడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ. నటనతోనే కాదు గ్లామర్ పరంగానూ మెప్పించింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న నిధి అగర్వాల్ కు హిట్స్ మాత్రం అంతగా పడలేదు.
ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. మొన్నటివరకు టాలీవుడ్ సినిమాలో మెరిసిన ఈ భామ. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇటీవలే రెండు పాన్ ఇండియా సినిమాలు చేసింది ఈ అందాల భామ.
ఇటీవలే ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహరవీరమల్లు సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా నిరాశపరిచింది. అలాగే ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ బ్యూటీ మాస్ రాజా రవితేజ కొత్త సినిమాలో ఎంపికైనట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇరుముడి సినిమా తర్వాత గోపిచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు రవితేజ. ఆ సినిమా కోసం నిధి అగర్వాల్ పేరును పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.




