
ఓటీటీల్లో రకరకాల జోనర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం థియేటర్స్ లో పెద్ద సినిమాలు లేవు.. దాంతో ప్రేక్షకులు ఓటీటీల్లో సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఆడియన్స్ ను ఆకట్టుకునేలా దర్శక నిర్మాతలు కూడా కొన్ని సినిమాలను డైరెక్ట్ గా ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు. ఇక థ్రిల్లర్, హారర్, రొమాంటిక్ సినిమాలకు ఉండే క్రేజే వేరు.. ఈ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఓ క్రేజీ మూడు థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఈ సినిమాలు చూడాలంటే నిజంగా దైర్యం ఉండాల్సిందే గురూ.. ఈ మూడు సినిమాల్లో ప్రతి సీన్ సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతాయి. పదినిమిషాలకో ట్విస్ట్ తో ఆడియన్స్ లో టెన్షన్ పెంచేస్తాయి ఈ సినిమాలు.. ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం..
వారెవ్వా..! ఏంటి ఈవిడ కమెడియన్ కూతురా.!! స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు గురూ..
ప్రస్తుతం ఓటీటీల్లో దుమ్మురేపుతున్న సినిమాల్లో మొదటిది రమన్ రాఘవ్ 2.0. ఈ సినిమాను 1960ల ముంబై సీరియల్ కిల్లర్ ఆధారంగా తెరకెక్కించారు. మన్నా అనే కిల్లర్, రాఘవన్ అనే పోలీస్ ఆఫీసర్ మధ్య జరిగే కథ ఇది. ఈ సినిమాలో హంతకుడు, పోలీస్ ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తూ ఉంటారు. దాంతో సినిమాలో ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాలో శోభిత దూళిపాళ్ల హీరోయిన్‌గా నటించింది. అలాగే శోభిత దూళిపాళ్ల గ్లామరస్ లుక్ లో ఆకట్టుకుంది. ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.
Jabardasth: అతను నాకు దేవుడితో సమానం.. చందాలు వసూలు చేసి నా కూతురికి పెళ్లి చేశా
ఇక మరో సినిమా వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై.. ఈ మూవీ 1970ల ముంబై అండర్‌వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో లో ఉంటుంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ సినిమా ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్ చుట్టూ తిరుగుతుంది. ఇద్దరు గ్యాంగ్ స్టర్స్ మధ్య గొడవలు ఈ సినిమాను ఆసక్తికరంగా మారుస్తాయి. ఈ సినిమా జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. ఇక మూడో థ్రిల్లర్ సినిమా గుర్గావ్ .. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ మూవీ ఓ కుటుంబ నేపథ్యంలో ఉంటుంది. ఫ్యామిలి ఓ అమ్మాయి కనిపించకుండాపోవడం, ఆతర్వాత ఆ ఫ్యామిలీ రహస్యాలు ఒకొక్కటిగా బయటపడటం ఆసక్తికరంగా ఉంటాయి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఈ మూడు థిల్లర్ సినిమాలు మిస్ అవ్వకుండాచూడండి.
వీడెవడండీ బాబు..! అంత అందమైన అమ్మాయి హాయ్ చెప్తే ఇలా చేశాడు..!! కృతిశెట్టి షాక్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.