Reading Time: < 1 minute

దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ’నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’. విరాట్ కర్ణా హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో పౌరాణిక కథ, చరిత్ర, యాక్షన్‌తో పాటు బలమైన ఎమోషన్స్, సాంస్కృతిక అంశాలు వున్నాయి. చిత్ర బృందం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెకండ్ సింగిల్ ‘సుర సుర…’ను ఏప్రిల్ 19న విడుదల చేయడానికి సిద్ధమవుతుండటంతో, సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ’సుర సుర’ పాటను సంప్రదాయ పెళ్లి సంబరాల ఆనందం, ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు. భారీ సెట్స్, గ్రాండ్ విజువల్స్, ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌లతో ఈ పాట సినిమాలో ఒక మెయిన్ హైలెట్ గా నిలవనుంది.

ఈ పాటకు సంగీతాన్ని జునైద్ కుమార్, అభే అందించగా, గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ ఈ పాటకు మరింత జోష్ తీసుకురానుంది. అనురాగ్ కులకర్ణి, కాల భైరవ, మంగ్లీ, సాహితి చాగంటి, కనకవ్వ, నల్గొండ గద్దర్ వంటి గాయకులు ఈ పాటకు గాత్రం అందించారు. కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యం వేడుకలు, సంప్రదాయం, కలిసికట్టుగా ఉండే ఆనందాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగి రెడ్డి ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్, రిషబ్ సావ్నీ, జగపతి బాబు, గరుడ రామ్, మహేష్ మాంజ్రేకర్, జయప్రకాశ్, మురళీ శర్మ, అనసూయ భరద్వాజ్, బి.ఎస్. అవినాష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ‘నాగబంధం’ చిత్రం జూలై 3న విడుదల కానుంది.