
NHAI Internship 2026: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) విద్యార్థులకు గొప్ప అవకాశం అందిస్తోంది. జాతీయ రహదారుల నిర్మాణ రంగంలో అనుభవం పొందాలనుకునే యువత కోసం “Summer Internship 2026” కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ఇంటర్న్‌షిప్‌లో ఎంపికైన విద్యార్థులకు శిక్షణతో పాటు నెలకు రూ.20,000 స్టైపెండ్ కూడా అందిస్తుంది.
అర్హత: ఈ ఇంటర్న్‌షిప్‌లో ఫుల్‌టైం UG, PG విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సివిల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఐటీ, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, డేటా సైన్స్, AI కోర్సులలో చదువుతున్నవారు, లా (BA LLB), మేనేజ్‌మెంట్ (MBA-HR, Finance, Marketing), కామర్స్ & సైన్స్ (BA/BCom/BSc), మాస్ కమ్యూనికేషన్, లైబ్రరీ సైన్స్ కోర్సులలో విద్యార్థులు అర్హులు.
- ఇంటర్న్‌షిప్ టైమ్: మే 4 నుంచి జూలై 5 వరకు (సుమారు రెండు నెలలు)
- వర్క్ లొకేషన్: సెలెక్ట్ అయిన విద్యార్థులు NHAI ఫీల్డ్ ఆఫీసులు లేదా ప్రధాన కార్యాలయంలో Senior Officers & Project Teams పర్యవేక్షణలో పని చేస్తారు.
- శిక్షణ: ఎంపికైన విద్యార్థులు భారీ రహదారి ప్రాజెక్టుల ప్లానింగ్, అమలు, నిర్వహణ అంశాలపై శిక్షణ పొందుతారు.
- స్టైఫండ్ తోపాటు సర్టిఫికేట్: నెలకు ₹20,000 స్టైపెండ్, Internship పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ కూడా అందిస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి..?
- ఆసక్తి ఉన్న విద్యార్థులు అధికారిక పోర్టల్ internshipsatnhai.digitalindiacorporation.in
ద్వారా ఆన్‌లైన్ అప్లై చేయాలి. - అప్లికేషన్‌లో అకడమిక్, పర్సనల్ వివరాలు ఇవ్వాలి. ప్రాజెక్ట్ లోకేషన్‌ను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.
- విద్యా సంస్థ ఆమోదించిన అప్లికేషన్స్ మాత్రమే తదుపరి ఎంపికలో పరిగణనలోకి తీసుకోబడతాయి.
- ఎంపిక తర్వాత ప్రాజెక్టులు అభ్యర్థుల ప్రాధాన్యాలు, అందుబాటును బట్టి కేటాయించబడతాయి.
- దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 15, 2026
- మరిన్ని వివరాలు NHAI Internship Portalలో చూడవచ్చు.