
పుణ్యానికి పోతే పాపం ఎదురొచ్చిందని నానుడి. ప్రస్తుత కాలంలో ఆపదలో ఉన్నవారికి సాయం చెయ్యాలన్నా అనుమానించాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఆపదలో ఉన్నవారిని సాటిమనిషిగా ఆదుకోవడం మన ధర్మం. కానీ, ఈ మానవత్వాన్ని కొందరు కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మూర్ఛ వచ్చినట్లు నటించాడు ఒకడు. వాడికి సహాయం చేయబోయిన ఒక రైతును నలుగురు యువకులు పక్కా స్కెచ్‌తో నిలువు దోపిడీ చేసిన ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగింది. కిష్టారం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే కౌలు రైతు, వ్యవసాయంలో వచ్చిన నష్టాల వల్ల అప్పుల్లో కూరుకుపోయాడు. తన కూతురు ఇచ్చిన బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి, వచ్చిన 67 వేల రూపాయలను జేబులో పెట్టుకుని బయటకు వచ్చాడు. అప్పటికే అక్కడ రెక్కీ వేసిన నలుగురు యువకులు సినీ ఫక్కీలో దోచేశారు. బ్యాంకు బయట ఒక యువకుడు బైక్ పై నుంచి పడిపోతూ ‘ఫిట్స్’ వచ్చినట్లు నటించాడు. మరో యువకుడు ‘రక్షించండి.. రక్షించండి’ అంటూ కేకలు వేశాడు. అది చూసి చలించిపోయిన నాగేశ్వరరావు ‘అయ్యో పాపం’ అంటూ పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ యువకుడిని పైకి లేపే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో మిగిలిన ఇద్దరు యువకులు వచ్చి సాయం చేస్తున్నట్లు నటిస్తూ.. అత్యంత చాకచక్యంగా రైతు జేబులోని 67 వేల నగదును కాజేశారు. తేరుకునేలోపే స్పోర్ట్స్ బైక్‌లపై నిందితులు పరారయ్యారు. పోలీస్ స్టేషన్ సమీపంలోనే, పట్టపగలు జరిగిన ఈ చోరీ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. సీసీ కెమెరా దృశ్యాలు బయటకు రావడంతో ఈ ‘మూర్ఛ డ్రామా’ దోపిడీ వెలుగులోకి వచ్చింది. రెక్కీ వేసి మరీ అమాయక రైతులను టార్గెట్ చేస్తున్న ఇటువంటి ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాలేజ్ బాత్రూమ్‌లో వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా గుండె గుభేల్
Dhurandar 2: ధురంధర్ సక్సెస్ విషయంలో బాలీవుడ్ సైలెన్స్‌కు రీజనేంటి ??
Drishyam 3: దృశ్యం 3 విషయంలో కన్ఫ్యూజన్.. తెలుగు వెర్షన్ ఉంటుందా ?? లేదా ?? అన్న డౌట్స్
Prabhas: డోంట్ కేర్.. నేను ఫుల్ క్లారిటీ తో ఉన్న అంటున్న డార్లింగ్