Reading Time: 2 minutes
బాలసుబ్రహ్మణ్యంతో గొడవపడ్డ ఒకేఒక్క హీరో.. ఆయనకు కొన్నేళ్ల పాటు పాటలు పడలేదట

తెలుగు చిత్రసీమలో అజాత శత్రువుగా పేరుగాంచిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో వేల సాంగ్స్ ఆలపించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు బాలసుబ్రహ్మణ్యం. ఆయన మరణాన్ని ఇప్పటికీ కొందరు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇండస్ట్రీలో బాలుకి ఎవ్వరితోనూ విభేదాలు లేవు.  కానీ ఒకే ఒక్క హీరోతో మాత్రం ఆయన మనస్పర్ధలు వచ్చాయి. ఆ హీరో ఎవరో కాదు సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో, బాలు అప్ కమింగ్ గాయకుడిగా ఉన్నారు. కృష్ణ తన సినిమాలకు బాలునే గాయకుడిగా ప్రోత్సహించారు. నేనంటే నేనే చిత్రంతో వీరి అనుబంధం బలపడింది. ఇదే చనువుతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కొందరు నిర్మాతలతో కలిసి, కేఎస్ఆర్ దర్శకత్వంలో కెప్టెన్ కృష్ణ సినిమా నిర్మించారు. ఈ సినిమా సమయంలో కృష్ణకు ఇవ్వాల్సిన  రూ.20,000 పారితోషికాన్ని బాలు ఇవ్వలేకపోయారట. బాలు కష్టాలను గమనించి కృష్ణ కూడా ఆ విషయాన్ని మరిచిపోయారట.

ఆ షో వల్ల నా కెరీర్ నాశనం అయ్యింది.. నా గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడుకున్నారు

కొన్నాళ్ల తర్వాత, విజయనిర్మల తన విజయకృష్ణ బ్యానర్‌లో పాటలు పాడమని బాలును కోరారు. అప్పుడు బాలు, తనకు రావలసిన రూ. 800 ఇస్తేనే పాడతానని కబురు పంపారట. దాంతో కృష్ణకు కోపం వచ్చిందట. బాలు ద్వారా తనకు రావలసిన రూ. 20,000ను బాలు కష్టాలను చూసి వదులుకున్న తాను, కేవలం రూ. 800 కోసం తమ బ్యానర్ను బాలు నిలదీయడం కృష్ణకు నచ్చలేదట. ఆ సమయంలో కృష్ణ, బాలుతో నువ్వు లేకుంటే నా సినిమాలు రిలీజ్ కావని చెప్పావా? అని నిలదీశారు. అయితే బాలు మాత్రం, ఎవరో గిట్టని వాళ్ళు చెప్పిన మాటలను కృష్ణ అపార్థం చేసుకున్నారని భావించి, చాలా ప్రశాంతంగా ఉండిపోయారట. అదే సమయంలో కృష్ణ తనకు రావలసిన రెమ్యూనరేషన్ పంపించమని కోరడంతో, బాలు గారు కృష్ణకు ఇవ్వాల్సిన రూ.20,000 బాకీని కూడా తీర్చేశారు. ఈ మనస్పర్ధల కారణంగా కృష్ణ, విజయనిర్మల దర్శకత్వంలో తెరకెక్కిన సూర్యచంద్ర సినిమాలో బాలుతో కాకుండా రాజ్-సీతారాంతో పాటలు పాడించారు.

ఆ హీరోను చూస్తే ఇప్పటికీ అసహ్యం వేస్తుంది.. అతను చేసిన పనికి అంటూ సీరియస్ అయిన విజయశాంతి

అప్పటినుండి కొన్నాళ్ల పాటు కృష్ణ నటించిన పలు చిత్రాలకు రాజ్-సీతారామే గానం అందించారు. అయితే, వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నప్పటికీ, కృష్ణ తన సినిమాల్లో బాలు సోదరి ఎస్పీ శైలజతో పాటలు పాడించేవారు. కొంతకాలం గడిచాక, కృష్ణ ఎస్.ఎస్. రవిచంద్ర దర్శకత్వంలో రౌడీ నంబర్ వన్ సినిమా తీసే సమయంలో, సంగీత దర్శకుడు రాజ్-కోటి, కృష్ణ దగ్గరికి వెళ్లి ఈ సినిమాలో పాటలు బాలు గారు పాడితే బాగుంటుందని సూచించారు. వేటూరి మధ్యవర్తిత్వంతో బాలును ఒప్పించారట. బాలు కూడా ఎలాంటి మొహమాటం లేకుండా పద్మాలయ స్టూడియోలో కృష్ణ గారిని కలిశారు. అప్పుడు కృష్ణ, ఇంతకు ముందు జరిగిన విషయాలను ఇద్దరం మర్చిపోదాం. మన ఇద్దరం కలిసి మళ్లీ పని చేద్దాం అని బాలుతో చెప్పారట. ఆ రోజు నుండి తిరిగి కృష్ణ చిత్రాలకు బాలు పాటలు పాడటం ప్రారంభించారు. కృష్ణ ఎంతో మంది నిర్మాతల కష్టాలను అర్థం చేసుకొని, వారికి రావాల్సిన పారితోషికాలను కూడా అడిగేవారు కాదు.

ఆరు నెలల్లోనే ఆ నిర్ణయం తీసుకున్నాం.. విడాకులపై ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.