July 15, 2026

SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. టీమ్‌లోకి ఆ స్టార్ బౌలర్ వచ్చేశాడోచ్..!

SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. టీమ్‌లోకి ఆ స్టార్ బౌలర్ వచ్చేశాడోచ్..!
Reading Time: < 1 minute
Ipl 2026 Srh Good News Ishan Malinga Fit Noc Rcb Match

SRH: ఐపీఎల్ 2026కు ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉంది. మార్చి 28న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య తొలి పోరు జగరనుంది. ఈ సందర్భంగా ఎస్‌ఆర్‌హెచ్‌కి గుడ్‌న్యూస్ వచ్చింది. తొలి మ్యాచ్‌కు ముందే శ్రీలంకకు చెందిన స్టార్ ఫాస్ట్ బౌలర్ ఎషాన్ మలింగ అంశంలో క్లారిటీ వచ్చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మలింగ గాయపడిన విషయం తెలిసిందే. ఆ గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్‌కు దూరమయ్యాడు. గాయం ఇంకా మానలేదని.. ఐపీఎల్‌లోనూ ఆడేందుకు అవకాశం లేదనే వార్తలు చెక్కర్లు కొట్టాయి. అయితే.. ఎషాన్ మలింగ తిరిగి ఫిట్‌నెస్ సాధించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులో చేరనున్నాడు. మరికొన్ని రోజుల్లోనే టీమ్‌లోకి వస్తాడని చెబుతున్నారు. ఫిట్‌నెస్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన మలింగకు ఐపీఎల్‌లో పాల్గొనేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికేట్’ (NOC) సైతం లభించింది. ఈ స్టార్ బౌలర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యార్కర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంటాడు. ఇదిలా ఉండగా.. ఎస్‌ఆర్‌హెచ్ టీమ్‌లో బ్యాటింగ్ లైనప్‌ బాగానే ఉన్నప్పటికీ.. బౌలింగ్‌లో మాత్రం జట్టు పేలవంగా ఉంది. ఈ నేపథ్యంలో మలింగ టీమ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఎస్‌ఆర్‌హెచ్‌కు బలం చేకూరనుంది.

READ MORE: 8th Pay Commission: గుడ్ న్యూస్.. 8వ పే కమిషన్‌లో జీతాలు రెట్టింపు అయ్యే అవకాశం.. బకాయిలు రూ.15 లక్షలు