Reading Time: 2 minutes

CSK Players: ఐపీఎల్ 2026లో సీఎస్కేకు భారంగా మారిన ముగ్గురు ఆటగాళ్లు

Caption of Image.

CSK Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మార్చి 28వ తేదీన ఆర్సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ తో టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. త్వరలోనే ప్రారంభమయ్యే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎదుర్కోబోయే సవాళ్లు, జట్టుకి ప్రతికూలంగా మారే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా టీమ్ లో ఉన్న ముగ్గురు ఆటగాళ్లు సీఎస్కేకు పెను భారంగా మారే ఛాన్స్ ఉంది.  ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై, 2026 సీజన్ కోసం భారీ మార్పులతో సిద్ధమైంది. వేలంలో ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ లాంటి యువ ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించిన సీఎస్‌కే, డెవాల్డ్ బ్రెవిస్, జేమీ ఓవర్టన్ వంటి విదేశీ స్టార్లతో పటిష్టంగా కనిపిస్తోంది. కానీ కొంతమంది కీలక ప్లేయర్స్ ఫామ్, మరికొందరికి అనుభవం లేకపోవడం జట్టుకు తీవ్ర ఇబ్బందిగా మారనుంది. 

1. నూర్ అహ్మద్: 
ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్‌ను గత మెగా వేలంలో సీఎస్‌కే ఏకంగా 10 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. 2025 సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచినప్పటికీ, ప్రస్తుతం అతని ప్రదర్శన ఆందోళన కలిగిస్తోంది. తాజాగా భారత్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో నూర్ అహ్మద్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. బ్యాటర్లు అతని బౌలింగ్‌ను ఈజీగా రీడ్ చేయగలుగుతున్నారు. చెన్నై పిచ్‌లు స్పిన్‌కు అనుకూలించినా, నూర్ తన గత ఫామ్‌ను అందుకోకపోతే సీఎస్‌కే బౌలింగ్ విభాగం కష్టాల్లో పడే ఛాన్స్ ఉంది. 

2. ప్రశాంత్ వీర్:
స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు ప్రత్యామ్నాయంగా యూపీకి చెందిన 20 ఏళ్ల ప్రశాంత్ వీర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 14.20 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. జడేజా వంటి వెటరన్ ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయడం ఈ యువకుడికి పెద్ద సవాలుగా మారనుంది. అనుభవం లేకపోవడంతో పాటు ఒత్తిడిలో అతని ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. జడేజాలా పొదుపైన బౌలింగ్, మెరుపు బ్యాటింగ్‌ను ప్రశాంత్ చేస్తాడా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.

►ALSO READ | SRH 300 Runs: కాటేరమ్మ కొడుకులు ఈసారి 300 కొట్టుడు ఖాయం

3. ఎంఎస్ ధోనీ: 
44 ఏళ్ల వయసులో ఎంఎస్ ధోనీ తన 19వ సీజన్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈసారి జట్టులో అతని పాత్రపై ఇంకా క్లారిటీ రాలేదు. జట్టులో సంజూ శాంసన్ ఉండటంతో ధోనీ వికెట్ కీపింగ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం లోయర్ ఆర్డర్ ఫినిషర్‌గా లేదా ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే అతను కనిపించే అవకాశం ఉంది. అతని అనుభవం జట్టుకు ప్లస్ అయినప్పటికీ, వయసు రీత్యా ఫిట్‌నెస్ సమస్యలు తలెత్తవచ్చు.. యువ ఆటగాళ్లతో పోటీ పడి రాణించడం ధోనీకి ఈ వయసులో సవాలుతో కూడుకున్న విషయం.  
 

©️ VIL Media Pvt Ltd.