Reading Time: < 1 minute

వైఎస్ఎస్ సేవలు అద్భుతం..స్వామి స్మరణానందకు ఉగాది పురస్కారం

Caption of Image.

హైదరాబాద్ సిటీ, వెలుగు: శతాబ్ద కాలంగా క్రియా యోగానికి సంబంధించి వైఎస్ఎస్ చేస్తున్న సేవలు అద్భుతమని ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి అన్నారు. వైఎస్ఎస్ ఉపాధ్యక్షుడు స్వామి స్మరణానందకు నగరంలోని ఓ మీడియా సంస్థ తరఫున గురువారం ఉగాది పురస్కారాన్ని అందజేశారు. స్వామీజీకి శాలువా కప్పి సత్కరించారు. యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రశంసించారు.

 ఈ సందర్భంగా అవార్డునందుకున్న స్వామి స్మరణానంద మాట్లాడుతూ క్రియాయోగం ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చన్నారు. మనసుకు, శ్వాసకు సంబంధం ఉంటుందని, శ్వాసను నియంత్రించడం ద్వారా ఆలోచనలను ప్రభావితం చేయవచ్చని, మనసును అదుపులో పెట్టుకోవచ్చన్నారు. క్రియాయోగ ధ్యానానికి సంబంధించిన పాఠాలను వైఎస్ఎస్ నుంచి పోస్ట్ ద్వారా పొందవచ్చన్నారు.

©️ VIL Media Pvt Ltd.