
కాస్త టైం దొరికితే.. చేపల షికారుకు వెళ్లడం పల్లెటూరి వాళ్లకు అలవాటు. అలా కొందరు యువకులు దగ్గర్లోని ఓ మడుగు వద్దకు చేపల పట్టేందుకు వెళ్లగా.. వారికి విచిత్ర అనుభవం ఎదురైంది. ఒక చోట చేపల కోసం నీటిని తోడే పని షురూ చేశారు. ఒక వ్యక్తి గట్టువేసి నీటిని ఒక వైపునకు మళ్లించగా, చేపలు అటుగా కదులుతున్నట్లు గమనించారు. ఈ సమయంలో ఒక పెద్ద క్యాట్ ఫిష్ కనిపించింది. ఈ సమయంలో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ఒక పాము అకస్మాత్తుగా అక్కడికి వచ్చి పెద్ద క్యాట్ ఫిష్‌ను పట్టుకుని దానితో పోరాడటం మొదలుపెట్టింది. ఈ దృశ్యాన్ని చూసిన వారు ఆశ్చర్యపోయారు. పాము చేపను గట్టిగా పట్టుకుని తినే ప్రయత్నం చేస్తుండగా, దానిని అడ్డుకోవాలని భావించారు. ఒక వ్యక్తి కర్రతో పామును విసిరేయడానికి ప్రయత్నించాడు. కానీ, పాము తన పట్టును ఏ మాత్రం వదలకుండా చేపను బలంగా పట్టుకుని ఉంది. ఎంత ప్రయత్నించినా పాము చేపను వదిలిపెట్టలేదు. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. కాగా సాధారణంగా నీటి పాములే చేపల్ని ఆహారంగా తీసుకుంటాయి. సో.. అది నీటి పాము అయి ఉంటుందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.
ఇంకొందరు క్యాష్ ఫిష్ మీరు ఎలాగూ తినరు. సో.. దాన్నైనా ఆకలి తీర్చుకోనివ్వాల్సింది కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా చేపల వేటకు వెళ్లినవారికి ఈ అనుభవం నిజంగా షాకింగే. మీరు ఎప్పుడైనా చేపల వేటకు వెళ్లినప్పుడు ఇలా జరిగిందా..? కామెంట్ ద్వారా తెలియజేయండి..