Reading Time: < 1 minute
Chicken Rates: చికెన్ ధరలు ఢమాల్.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

ఆదివారం వచ్చిందంటే చాలు నాన్‌వెజ్ ప్రియులు చికెన్, మటన్, ఫిష్ ను ఇష్టంగా కొనుగోలు చేసుకుంటారు.. కర్రీ, ఫ్రై తోపాటు.. పలు రకాల పద్దతుల్లో వండుకుని తింటారు. అయితే.. సాధారణంగా అందరి కళ్లు ధర తక్కువగా ఉన్న చికెన్ వైపు మళ్లుతుంది.. నాన్ వెజ్ లో చికెన్ ను ఎక్కువగా వండుకుంటారు.. అయితే.. ఇటీవల భారీగా పెరిగిన చికెన్ ధరలు.. అనంతరం పడిపోయాయి.. మార్చిలో ఏకంగా 400 వరకు పెరిగి.. ఆ తర్వాత.. క్రమంగా దిగి వచ్చాయి.. ప్రస్తుతం ధర అమాంతం పడిపోయింది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏప్రిల్ 26 ఆదివారం లైవ్ బర్డ్ ఫామ్ రేట్ కేజీ రూ.105 లు పలుకుతోంది.. రిటైల్ రేట్ రూ.132 ఉంది. పోయిన వారంతో పోలిస్తే.. రూ.40 వరకు ధర తగ్గింది.

చికెన్ లేటెస్ట్ ధరలు..

కేజీ చికెన్ డ్రెస్సెడ్ ధర రూ. 191 నుంచి రూ. 220 మధ్య ఉంది.. స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ. 218 నుంచి రూ. 230 వరకు పలుకుతోంది. అయితే.. ప్రాంతాలను బట్టి చికెన్ ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.

హైదరాబాద్ నగరంలో కేజీ చికెన్ ధర రూ.260, 280 వరకు పలుకుతోంది.

గుడ్లు రిటైల్ – డజన్ (12) ధర రూ.72 గా ఉంది.

అయితే.. మటన్ కేజీ ధర రూ.900 నుంచి రూ.1000 వరకు పలుకుతోంది.. అయితే.. ప్రాంతాన్ని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.

అయితే.. ఎండలు పెరుగుతుండటంతో.. ధరలు మున్ముందు కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు కోళ్ల ఫాం వ్యాపార నిపుణులు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..