Reading Time: < 1 minute
Riteish Deshmukh Raja Shivaji Movie Advance Bookings Genelia Tweet

భారతీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తూ రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం ‘రాజా శివాజీ’. రితేష్ దేశ్‌ముఖ్ కథానాయకుడిగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జెనీలియా దేశ్‌ముఖ్ తన సొంత బ్యానర్ ‘ముంబై ఫిల్మ్ కంపెనీ’పై నిర్మించారు. మే 1న మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అయితే మొదట మరాఠీలో రూపొందించినప్పటికీ, ఈ సినిమా క్రేజ్ దృష్ట్యా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో కూడా డబ్ చేసి ఏకకాలంలో విడుదల చేస్తున్నారు. శివాజీ మహారాజ్ చరిత్రకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఆదరణ ఉండటంతో ఇక్కడ కూడా భారీగా థియేటర్లను కేటాయిస్తున్నారు. అయితే..

తాజాగా జెనీలియా సోషల్ మీడియా వేదికగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైనట్లు ప్రకటించారు. ‘మరో కొత్త ఆరంభం.. హిందూ స్వరాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తిదాయక కథ ఇది. ఈరోజే మీ టికెట్లను బుక్ చేసుకోండి’ అంటూ ఆమె మరాఠీ భాషలో ట్వీట్ చేస్తూ అభిమానులను కోరారు. ఈ ట్వీట్‌తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. శివాజీ మహారాజ్ పాత్రలో నటించడం, ఆ సినిమాకు దర్శకత్వం వహించడం రితేష్ దేశ్‌ముఖ్ కెరీర్‌లోనే అతిపెద్ద కల. ఈ సినిమా కోసం ఆయన ఎంతో శ్రమించారు.కాగా ఈ చిత్రానికి అజయ్-అతుల్ మరియు సంతోష్ నారాయణన్ సంగీతం అందించడం విశేషం. పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ఇక విజువల్ ఎఫెక్ట్స్ యుద్ధ సన్నివేశాల కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులను రంగంలోకి దించారు.