పాలు, పంచదార లేకుండా మెత్తని రవ్వ లడ్డును కేవలం 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఇదేలాగా అనుకుంటున్నారా? తలచుకుంటే ఏది అసాధ్యం చెప్పండి. ఒకసారి చేస్తే మీ ఇంట్లో వాళ్ళకి ఫేవరేట్ గా మారుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు తినొచ్చు. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..
మెత్తని రవ్వ లడ్డుకు కావలసిన పదార్థాలు: ఒక కప్పు ఉప్మా రవ్వ, ముప్పావు కప్పు పటిక బెల్లం, మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి,
రవ్వను బట్టి ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు అంటే నాలుగు టేబుల్ స్పూన్లు వరకు మాత్రమే మరి ఎక్కువగా వెయ్యకూడదు. అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 10 జీడిపప్పులు , 10 కిస్ మిస్ లు, 10 బాదం పప్పులు తీసుకోవాలి.
ముందుగా రవ్వను వేయించకూడదు: ముందుగా పాన్ లో 1 టీ స్పూన్ నెయ్యి వేసి అది బాగా వేడయ్యాక దానిలో రవ్వ వేసి మీడియం మంట పై స్లోగా వేయించాలి. రవ్వ గోల్డ్ రంగులోకి మారిన తరవాత కిందకు దించేయండి. ఈ స్టెప్‌లో మరి ఫాస్ట్ గా కాకుండా స్లోగా వేయిస్తే లడ్డూలు మెత్తగా అవుతాయి. వేయించిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
పటిక బెల్లం ఇలా కలుపుకోవాలి: రవ్వ వేడి మీద ఉన్నప్పుడు పటిక బెల్లం పొడి చేతితో కలుపుకోవాలి. వేడి ఉన్నప్పుడే దీనిని వేస్తే ఈ పొడి కరిగి రవ్వతో మిక్స్ అవుతుంది. ఈ మిశ్రమం గట్టిగా ఉంటే దానిలో రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇలా చేస్తే
లడ్డూలు మెత్తగా అవుతాయి. దీనిని కొద్దీ సేపు ఫ్యాన్ కింద పెట్టి ఆరనివ్వాలి.
ఇప్పుడు ఒక పాన్ పెట్టి దానిలో మళ్ళీ నెయ్యి వేసి 10 జీడిపప్పు, 10 కిస్మిస్ వేసి వాటిని బంగారు రంగులోకి మారే వరకు బాగా వేయించాలి. వీటిని లడ్డు మిశ్రమంలో వేసి, యాలకుల పొడిని కూడా వేయాలి. ఇది వేడి మీద ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకుని మీడియం సైజ్ లో ఉండలుగా చేయాలి. ఇలా చేసిన వాటిని ఒక ప్లేట్ లో పెట్టుకుని తినడమే.




