
టాలీవుడ్ కింగ్ నాగార్జున వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కుర్రహీరోలతో పోటీ పడుతూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. కేవలం హీరోగానే కాదు ఇటీవల రూట్ మార్చి సహాయక పాత్రల్లో అలాగే విలన్ గానూ నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ధనుష్ హీరోగా నటించిన కుబీర సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటించారు నాగార్జున. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించి మెప్పించారు. ఇక సినిమాలో నాగార్జున అదరగొట్టారు. ఇక ఇప్పుడు మరోసారి సోలో హీరోగా సినిమా చేస్తున్నారు. నాగ్ త్వరలోనే తన 100వ సినిమా చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : RGV: స్టార్‌లా ఫీల్ అవ్వకు.. దెబ్బైపోతావ్ అని అతని అప్పడే చెప్పా.. వినలేదు
ఈ మైల్డ్ స్టోన్ సినిమాను నాగ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో అఖిల్, నాగ చైతన్య గెస్ట్ రోల్స్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. అలాగే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ టబు నటిస్తుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే నాగార్జున ఇండస్ట్రీలో అన్నయ్య అని పిలిచే ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా.? ఈ విషయాన్నీ నాగార్జుననే ఓ స్టేజ్ పై పంచుకున్నారు.
ఇది కూడా చదవండి :Laila: వింత వ్యాధితో బాధపడుతున్న లైలా.. 30 సెకన్లు కూడా కంట్రోల్ చేసుకోలేదట
కింగ్ నాగార్జున అన్నయ అని పిలిచే ఏకైక వ్యక్తి నందమూరి హరికృష్ణ. నాగార్జున, హరికృష్ణ కలిసి సీతారామరాజు అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో నాగ్, హరికృష్ణ అన్నదమ్ములుగా కనిపించారు. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అప్పటి నుంచి హరికృష్ణను హరి అన్న అని పిలుస్తుంటారు నాగార్జున. హరికృష్ణ మరణం తనను ఎంతగానో బాధపెట్టిందని నాగార్జున గతంలో ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలిపారు. నందమూరి హరికృష్ణను హరి అన్నయ్య అని పిలుస్తా.., ఆ బంధం గురించి మాటల్లో చెప్పలేను. ఆయన మరణవార్త తన పుట్టినరోజు నాడే వచ్చిందని, హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.