
Buchi Babu: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్నారు. తాజాగా ధనుష్ హీరోగా నటిస్తున్న ‘కర’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన, తన తదుపరి చిత్రాల గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. స్టేజ్ మీద ఫ్యాన్స్ కేకలు, అరుపుల మధ్య ఆయన పడ్డ టెన్షన్, అలాగే ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘పెద్ది’ సినిమా అప్‌డేట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ప్లీజ్ మాట్లాడనివ్వండి.. టెన్షన్ వస్తోంది..
ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఫ్యాన్స్ గోల చేస్తుండటంతో బుచ్చిబాబు కాస్త ఇబ్బందికి గురయ్యారు. “ప్లీజ్ కొంచెం మాట్లాడనివ్వండి.. మీరు అలా అరుస్తుంటే నాకు టెన్షన్ వచ్చేస్తోంది. నేను నేరుగా షూటింగ్ సెట్ నుంచి ఇక్కడికి వచ్చాను” అని చెబుతూ ఫ్యాన్స్‌ను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. తను ప్రస్తుతం ఒక భారీ ఐటెం సాంగ్ షూటింగ్‌లో ఉన్నానని, ఆ హడావిడిలోనే ఈ ఫంక్షన్‌కు హాజరయ్యానని ఆయన వెల్లడించారు. ఈ పాట సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోందని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పెద్ది’ సినిమా గురించి బుచ్చిబాబు ఈ వేదికపై నుంచి క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రం జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ఆయన స్పష్టం చేశారు.