Reading Time: < 1 minute
Ms Dhoni Fit But No Comeback Yet Real Reason Behind Csk Stars Ipl 2026 Absence Revealed

MS Dhoni Fit But No Comeback Yet: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్, భారత దిగ్గజం ఎంఎస్ ధోనీ రీఎంట్రీపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. గాయంతో ఈ సీజన్‌కు దూరంగా ఉన్న ధోనీ.. ప్రస్తుతం ఫిట్‌నెస్ టెస్ట్‌ను క్లియర్ చేశాడట. అయినప్పటికీ జట్టులోకి రావడంపై ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. టీమ్ కాంబినేషన్‌ను దృష్టిలో పెట్టుకుని తానే స్వచ్ఛందంగా వెనక్కి తగ్గుతున్నాడని నివేదికలు సూచిస్తున్నాయి. ఐపీఎల్ 2026లో ఆడడం, ఆడకపోవడం ధోనీ చేతుల్లోనే ఉందని తెలుస్తోంది.

మోకాలి గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్‌లో ఎంఎస్ ధోనీ ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే కొన్ని రోజలుగా జట్టుతో పాటే ప్రయాణిస్తున్నాడు. గత వారం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. ఇటీవల ఫిట్‌నెస్ టెస్ట్‌ను క్లియర్ చేశాడట. అయితే తాను జట్టులోకి వస్తే.. యువ ఆటగాడు తప్పుకోవాల్సి ఉంటుందని మహీ భావిస్తున్నాడట. అలాగే కీలక దశలో జట్టు సమతుల్యతను దెబ్బ తీయకూడదనే ఉద్దేశంతో రీఎంట్రీని వాయిదా వేస్తున్నట్లు సమాచారం. ఈ సీజన్‌లో చెన్నై ఆశించిన స్థాయిలో రాణించకపోయినా.. ధోనీ నిర్ణయం పూర్తిగా అతని చేతుల్లోనే ఉందని చెబుతున్నారు.

సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్ మిచెల్ హస్సి కూడా ఈ విషయంపై స్పష్టత ఇచ్చాడు. ఎంఎస్ ధోనీ తిరిగి వస్తే కేవలం బ్యాటర్‌గా కాకుండా వికెట్‌కీపర్‌గా ఆడతాడని వెల్లడించాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే ఉపయోగించాలన్న ఆలోచన లేదని తెలిపాడు. ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌కు ముందు ధోనీ నెట్స్‌లో వికెట్‌కీపింగ్ ప్రాక్టీస్ చేసినా.. ఇంకా మ్యాచ్‌కు పూర్తిగా సిద్ధంగా లేడని కోచ్ తెలిపాడు. పరుగులు తీసే సమయంలో, ముఖ్యంగా చివరి ఓవర్లలో వేగంగా పరుగులు చేయడానికి గాయం నుంచి పూర్తిగా కోలుకోవాల్సి ఉందని వివరించాడు. ప్రస్తుతం ధోనీ నెట్స్‌లో మంచి ఫామ్‌లో కనిపిస్తున్నప్పటికీ.. పూర్తి ఫిట్‌నెస్ సాధించిన తర్వాతే మైదానంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ‘తల’ మళ్లీ మైదానంలో మెరవాలని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.