Reading Time: 2 minutes
Vikram: 60ఏళ్ల వయసులోనూ 20లా.. యంగ్‌ లుక్ కోసం విక్రమ్ సీక్రెట్ ఇదేనా.?

తమిళ్ స్టార్ హీరో విక్రమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన సినిమాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. తమిళనట స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న విక్రమ్ తెలుగులోనూ మంచి క్రేజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. అలాగే విక్రమ్ నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా విక్రమ్ నటించిన అపరిచితుడు సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. తెలుగులోనూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆతర్వాత విక్రమ్ నటించిన అనేక సినిమాలు మన దగ్గర ప్రేక్షకులను అలరించాయి. అయితే విక్రమ్ వయసు ప్రస్తుతం 60ఏళ్లు అయినా కూడా ఆయన యంగ్ లుక్ లో 20, 25ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నారు. ఇటీవలే విక్రమ్ కు సబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇది కూడా చదవండి : RGV: స్టార్‌లా ఫీల్ అవ్వకు.. దెబ్బైపోతావ్ అని అతని అప్పడే చెప్పా.. వినలేదు

విక్రమ్ లుక్ నెటిజన్స్ ను , ఆయన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. విక్రమ్ కొడుకు కూడా ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. విక్రమ్ కొడుకు ధృవ్ తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే బైసన్ అనే సినిమాతో హిట్ అందుకున్నాడు. ధృవ్ వయసు ప్రస్తుతం 30 కానీ విక్రమ్ మాత్రం ధృవ్ కన్నా యంగ్ గా కనిపిస్తున్నాడు. అయితే విక్రమ్ అంత హ్యాండ్సమ్ గా కనిపించడం పై రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇది కూడా చదవండి :Laila: వింత వ్యాధితో బాధపడుతున్న లైలా.. 30 సెకన్లు కూడా కంట్రోల్ చేసుకోలేదట

ముఖ్యంగా కోలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న వార్తల్లో విక్రమ్ హ్యాండ్సమ్ గా కనిపించడానికి సర్జరీ చేయించుకున్నాడు అంటూ టాక్ చక్కర్లు కొడుతున్నాయి. యవ్వనంగా కనిపించేందుకు విక్రమ్‌ సర్జరీ చేయించుకున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.విదేశాల్లో కాస్మోటిక్ ట్రీట్‌మెంట్‌ చేయించుకోవడం వల్లే విక్రమ్ ఇలా యంగ్ గా కనిపిస్తున్నారని అంటున్నారు కొందరు.. మరికొందరేమో ఆహారపు అలవాట్లు, ప్రకృతి వైద్యం వల్లే విక్రమ్ ఇలా ఉన్నారంటున్నారు. విక్రమ్ సర్జరీకి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ ఈ వార్తలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీని పై విక్రమ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇది కూడా చదవండి : OTT Movie : పాడుబడ్డ కాలేజ్‌లో బాధతో విలవిలలాడే ఆత్మ.. సినిమా వచ్చి 25ఏళ్లు.. చూస్తే ఇప్పటికీ తడిసిపోతుంది

 

View this post on Instagram

 

A post shared by Vikram (@the_real_chiyaan)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.