Reading Time: < 1 minute
Dhanush And Venky Atluri To Reunite The Vaathi Combo Is Back For A New Project

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి మరోసారి చేతులు కలపబోతున్నారనే వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘సార్’ సినిమా సామాజిక సందేశంతో పాటు కమర్షియల్‌గానూ భారీ వసూళ్లను సాధించింది. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ సెట్స్ పైకి వెళ్లడం ఖాయమని తెలుస్తోంది.

తాజాగా జరిగిన కర తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ధనుష్ మాట్లాడూతూ ‘ వెంకీ ఆ మధ్య ఓ కథ చెప్పావ్ మళ్ళి కనిపించకుండా పోయావ్.. నువ్వు చెప్పిన స్టోరీతో సినిమా చేద్దాం. నేను ఎదురుచూస్తుంటాను. నువ్వు డైరెక్ట్ చేసిన అవ్వాలని ‘విశ్వనాథం అండ్ సన్స్’ హిట్ అవ్వాలి కోరుకుంటున్నాను’ అని అన్నాడు.  ‘సార్’ సినిమాలో మాస్టర్‌గా మెప్పించిన ధనుష్ ఈసారి వెంకీ అట్లూరి కథలో సరికొత్త కథతో రాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ధనుష్ తన వరుస సినిమాలతో బిజీగా  ఉన్నాడు. ఆయన నటించిన కర ఈ నెల 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అయింది. చేతులో ఉన్న సినిమాలను చక చక ఫినిష్ చేసి వెంకీ అట్లూరి ప్రాజెక్ట్‌ను వీలైనంత త్వరగా పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై అతి త్వరలోనే చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ధనుష్ మరియు వెంకీ అట్లూరి మళ్లీ కలిసి పనిచేస్తున్నారనే వార్త బయటకు రావడంతో అభిమానులు మరో క్లాసిక్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.